కిరాయి కార్పెంటర్ షాపులకు 4వ కేటగిరి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి--సీఐటీయూ
కార్పెంటర్ షాపులకి నాలుగవ కేటగిరి కింద వర్తిస్తున్న విద్యుత్ సబ్సిడీ కిరాయి షాపులకు కూడా వర్తింపచేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు
సోమవారం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1994 నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్న కాలంలో కమ్మరి వడ్రంగి గోల్డ్ స్మిత్ తదితర షాపులకు నాలుగవ కేటగిరీ కింద విద్యుత్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని అంగీకరింప చేయడం జరిగిందని తెలిపారు. నాటినుండి ఈ పథకం అమలవుతుందని అన్నారు. ఎక్కువమంది కార్పెంటర్లు సొంత షాపులు లేకుండా కిరాయి షాపులు నడుపుకుంటున్నారని వారికి విద్యుత్ సబ్సిడీ అమలు కాకపోవడంతో పూర్తి కరెంటు బిల్లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సొంత షాపులకు ఇస్తున్న సబ్సిడీ మాదిరిగానే లీజు అగ్రిమెంట్ పేపర్ తీసుకొని కిరాయి షాపులకు కూడా సబ్సిడీ వర్తింప చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నలగొండ పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, కార్యదర్శి దాసోజు ప్రభు చారి, కోశాధికారి కే సురేష్, ఉపాధ్యక్షులు గడగోజు సైదాచారి, సహాయ కార్యదర్శి గుంటోజు సోమయాచారి, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు
Oct 18 2023, 18:55