మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె తాత్కకలికవాయిదా
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా విద్య అధికారి కార్యాలయంలో సహాయ సంచాలకులు రంగాచారి కి సమ్మె విరమణ పత్రం అందజేయడం జరిగింది వారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అదనంగా పెంచిన రూ.2000 వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని మొత్తం సరిపడా బడ్జెట్ ను కేటాయించాలని లేదా క్రొత్త మెనూను సవరించాలని ముఖ్యమంత్రి అల్పాహారం పనికి అదనం వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 28 నుండి నిరవధక సమ్మె చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని తేదీ 9 10 2023న ఉదయం 9 గంటలకు వారి నివాసంలో సిఐటి యు ప్రతినిధి బృందం కలిసి చర్చించారని అన్నారు.ఈ సందర్భంగా వారు స్పందిస్తూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే పెండింగ్ బిల్లులు, గౌరవితనం బడ్జెట్ విడుదల చేశామని వాటి ఫాలో కోసం అధికారిని కేటా ఇస్తామని ముఖ్యమంత్రి అల్పాహార పథకం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరగా
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను మరింత మోసం చేస్తుందని రెండు సంవత్సరాలుగా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం సరైనది కాదని మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారని అధిక అప్పులు చేసి ఉన్న ఆస్తులు గాలి బొట్టులు తాకట్లు పెట్టి మధ్యాహ్న భోజన పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారని ఎప్పుడు బిల్లులు అడిగినా ఎప్పుడు జీతాలు అడిగినా ఫ్రీజింగ్ లో ఉన్నాయని రకరకాల ఆరు నెలలు సంవత్సరాలు 8 నెలలు పెండింగ్లో పెడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులను మరింత అప్పుల పాలు అవుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమ్మె తాత్కాలిక విరమణ తప్ప సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ ,జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, పందుల ముత్యాలి తదితరులు పాల్గొన్నారు
Oct 12 2023, 17:52