/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె తాత్కకలికవాయిదా Raghu ram reddy
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె తాత్కకలికవాయిదా

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.

      

బుధవారం నల్లగొండ జిల్లా విద్య అధికారి కార్యాలయంలో సహాయ సంచాలకులు రంగాచారి కి సమ్మె విరమణ పత్రం అందజేయడం జరిగింది వారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అదనంగా పెంచిన రూ.2000 వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని మొత్తం సరిపడా బడ్జెట్ ను కేటాయించాలని లేదా క్రొత్త మెనూను సవరించాలని ముఖ్యమంత్రి అల్పాహారం పనికి అదనం వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 28 నుండి నిరవధక సమ్మె చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని తేదీ 9 10 2023న ఉదయం 9 గంటలకు వారి నివాసంలో సిఐటి యు ప్రతినిధి బృందం కలిసి చర్చించారని అన్నారు.ఈ సందర్భంగా వారు స్పందిస్తూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే పెండింగ్ బిల్లులు, గౌరవితనం బడ్జెట్ విడుదల చేశామని వాటి ఫాలో కోసం అధికారిని కేటా ఇస్తామని ముఖ్యమంత్రి అల్పాహార పథకం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరగా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను మరింత మోసం చేస్తుందని రెండు సంవత్సరాలుగా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం సరైనది కాదని మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారని అధిక అప్పులు చేసి ఉన్న ఆస్తులు గాలి బొట్టులు తాకట్లు పెట్టి మధ్యాహ్న భోజన పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారని ఎప్పుడు బిల్లులు అడిగినా ఎప్పుడు జీతాలు అడిగినా ఫ్రీజింగ్ లో ఉన్నాయని రకరకాల ఆరు నెలలు సంవత్సరాలు 8 నెలలు పెండింగ్లో పెడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులను మరింత అప్పుల పాలు అవుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమ్మె తాత్కాలిక విరమణ తప్ప సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు

       

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ ,జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, పందుల ముత్యాలి తదితరులు పాల్గొన్నారు

నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కాజీపేట: ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి.

ఈనెల 15 వరకు ప్యాసింజర్లు..: కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సీఐడీ కార్యాలయానికి నారా లోకేష్‌

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి బయల్దేరారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌..

ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను సీఐడీ విచారించనుంది. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై లోకేష్‌ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేడు ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్‌ హాజరు కావాల్సి ఉంది. కాగా, చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత..

న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్‌కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్‌

ఎన్నికలలో పోటీ చేయడానికి సిపిఎం సన్నద్ధం

    జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి వర్గ సభ్యులు వెల్లడి 

రాబోయే ఎన్నికలలో సిపిఎం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమని కార్యకర్తలను సమయత్తం చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై రంగారెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల బిజెపి పాలనలో దేశం అధోగతి పాలయిందని అన్నారు దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని దేశంలో మత ఉన్మాదపు చర్యలకు పాల్పడ్డారని దేశాన్ని ఆదాని అంబానీ లాంటివి పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలని ధారాధత్వం చేశారని అన్నారు. కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజల హక్కులను కాల రాశారని అన్నారు ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను బిజెపి ప్రభుత్వం తుడిచి పెట్టేసిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దేశంలో రెండు పూటలా తిండి తినలేని పరిస్థితులకి పేదలని నెట్టివేసిందని ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట చెప్పి నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని అన్నారు దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ సెక్యులర్ ప్రజాస్వామ్యం పదాలను తొలగించి ప్రశ్నించే వారిపైన దాడులకు ఉసిగొలుపుతుందని అన్నారు.

మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని తుంగలో తొక్కిందని డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించిందని జ్యోతిష్యము మూఢనమ్మకాలు లాంటి పాఠాలలో ప్రవేశపెట్టడం దౌర్భాగ్యస్థితికి నిదర్శనం అని అన్నారు. భారతదేశంలో పత్రిక మీడియా స్వేచ్ఛలను హరించి వేసిందని అక్రమ దాడులు కొనసాగిస్తూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జర్నలిస్టులను జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నించారు వామపక్ష భావజాలం ఉన్న నాయకుల ఇండ్లపై దాడులు చేస్తూ భయపతాన్ని సృష్టిస్తుందని అన్నారు. సనాతన ధర్మం పేరా ప్రజలను అణిచి వేయడానికి ఉపయోగపడే చర్యలకు పూనుకుంటుందని అన్నారు ప్రజలు రాబోయే ఎన్నికలలో బిజెపి మతోన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వేల శిలాఫలకాలు ఏమిటని ప్రశ్నించారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందారని అన్నారు నిరుద్యోగులకు నిరాశ చూపారని ఉద్యోగ నియామకాలలో అసంబద్ధమైన నిర్ణయాల వలన యువత అయోమయానికి గురయ్యారని టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు ప్రాణప్రదమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి నిధులు కేటాయించకపోవడం దానిని పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి మూలమని తెలిపారు ప్రజల చేతుల్లో ఉన్న భూములను పట్టాలివ్వకుండా ధరణి పేరా తొక్కి పెడుతున్నారని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాసన్ పట్టణ కార్యదర్శి ఎం డి సలీం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణ రెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మండల కార్యదర్శిలు నలుపరాజు సైదులు మన్నెం బిక్షం కందుల సైదులు శ్రీకర్ జిల్లా అంజయ్య కొండ వెంకన్న దొండ కృష్ణారెడ్డి దండంపల్లి సరోజ బొల్లోజు భారత కానుగు లింగస్వామి యాదయ్య గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

పాలడుగు నాగార్జున నల్లగొండ

రేపటి నుండే అందుబాటులోకి మహాప్రస్థానం సేవలు

 అత్యాధునిక వసతులు..ఆధునిక సౌకర్యాలతో పార్క్ ని తలపిస్తున్న మహాప్రస్థానం

మహాప్రస్థానంలో కాటికాపర్లతో సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి

అంతిమ సంస్కారాల రుసుము 6 వేలు గా నిర్ణయం

రేపటి నుంచి ప్రారంభం కానున్న కార్యకలాపాలు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం

భూతల స్వర్గాన్ని తలపిస్తున్న  సూర్యాపేట లోని మహా ప్రస్థానం సేవలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. సకల వసతులు, అత్యాధునిక సౌకర్యాలతో రూ.. 4.20 కోట్ల తో ఆదునికరించిన మహాప్రస్థానం సేవలకు సిద్ధంగా ఉంది..

 

అంత్యక్రియల రుసుము 6 వేలు గా నిర్ణయం

 సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద వద్ద ఉన్న మహాప్రస్థానం గతం లో సౌకర్యాల లేమీ తో ప్రజలు ఇబ్బందులు పడేవారు.. ఇక అంత్యక్రియలు నిర్వహించాలంటే జేబులు గుల్ల అయ్యేవి. మంత్రి జగదీష్ గారు తీసుకున్న నిర్ణయం, చొరవ తో మహా ప్రస్థానం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకే రుసుము తో అది కూడా అందుబాటు లో ఉండే విధంగా మహాప్రస్థానం లో కాటి కాపరులతో సమావేశం అయిన మంత్రి జగదీష్ రెడ్డి, అంత్యక్రియల ఫీజు 6 వేలు గా నిర్ణయించారు.. ఈ ఫీజు రాష్ట్రం లోనే సూర్యాపేట లోనే అతి తక్కువ కావడం మరో విశేషం..

  కిరాయి దారులకు సౌకర్యం గా అద్దె కాటేజ్ లు

అద్దె ఇళ్ళ లో ఉండే వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఎదుర్కొనే సమస్య వర్ణాతీతం. యజమానులు పార్థివదేహన్ని ఉంచకూడదని పెట్టే షరతులు ఒక వైపు, భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి మరోవైపు అష్ట కష్టాలు పడేవారు.కిరాయి దారుల సమస్యలను గుర్తించిన మంత్రి అటువంటి అభాగ్యుల కోసం మహాప్రస్థానంలో చనిపోయినాటినుండి కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఉండి జరిపించుకునేందుకు వీలుగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అతి తక్కువ ఫీజుతో పదిమంది కుటుంబ సభ్యులు ఉండేలా రెండు కాటేలను సిద్ధం చేశారు.

కెసిఆర్ పాలనలోని గ్రామాల అభివృద్ధి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ

పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి

కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను ససశ్యామలం చేసింది బీఆర్ఎస్

➖➖➖➖➖➖➖➖

పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామం లో బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి

గిడ్డంగుల సంస్థ ఆద్వర్యంలో రూ.9.70 కోట్ల తో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ తో నిర్మించనున్న గౌడాన్ కు శంకుస్థాపన.

➖➖➖➖➖➖➖➖

 పెన్ పహాడ్ 

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పెన్ పహాడ్ మండలంలోని చీదెళ్ళ గ్రామం లో పర్యటించిన మంత్రి గ్రామం లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. తమ అభిమాన నేత జగదీష్ రెడ్డి రాక ను తెలుసుకున్న గ్రామ మహిళలు పెద్ద ఎత్తున మంత్రి కి ఎదురెళ్లి స్వాగతం పలికారు. రైతులు తమ ఉత్పత్తుల ను నిలవ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ , రూ..9.70 కోట్ల రూపాయల తో గ్రామంలో నిర్మించనున్న గౌడాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్‌ చొరవతోనేనని తెలిపారు.కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే అన్నారు.2014 కు ముందు 

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను వందలాది కిలో మీటర్ల నుండి గోదావరి జలాలను తెచ్చి ససశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ నే అన్నారు.

పల్లెప్రగతి ద్వారా గ్రామానికి ఒక ట్రాక్టర్‌తో పాటు శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, హరితహారం, నర్సరీ తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు పల్లెలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయన్నారు.

అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారిందన్నారు. తండా లను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గతం లో దుమ్ము దూలి తో ఉన్న రహదారులు నేడు అద్దం లా రూపుదిద్దుకున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 

టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య , మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, సర్పంచ్ పరెడీ సీతారాంరెడ్డి , సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామ్ రెడ్డి , ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు , రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గుర్రం అమృతా రెడ్డి. మిరియాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, వార్డ్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి షాక్.. రూ.11 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు

తెలంగాణలోని ప్రముఖ ఆలయం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. రూ.11 కోట్లు పన్ను చెల్లించాలంటూ మల్లన్న దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు..

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసినప్పటికీ 12ఏ రిజిస్ట్రేషన్‌ను ఆలయ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు.. దాదాపుగా 1995 నుంచి ఐటీ రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 

దీనిపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. 1995 నుంచి ఐటీ రిటర్న్‌లు, ఆడిట్ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.

ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ.8 కోట్ల ట్యాక్స్ దీనికి రూ.3 కోట్ల జరిమానా మొత్తం రూ.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలపై సాధారణ వ్యక్తులు, కంపెనీలతో వ్యవహరించినట్లుగా కఠిన వైఖరిని అవలంబించొద్దని భక్తులు సూచిస్తున్నారు. మరి ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు

హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది..

సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. మార్క్ ఆంటోనీ చిత్రం సర్టిఫికేషన్ విషయంలో అసలేం జరిగిందన్న దానిపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశముంది.

తాను నటించి, నిర్మించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు క్లియరెన్స్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన హీరో విశాల్.. వారు అడిగిన మొత్తం రెండు విడతలుగా చెల్లించారు.

వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఆ తర్వాత ఓ ట్వీట్ చేశారు. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. తనలాంటి వారి పరిస్దితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు.

పట్టణాల అభివృద్దే బిఆర్ఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

3వ వార్డ్ నందు....

10 లక్షల రూపాయల సిడిపి ఎమ్మెల్సీ గారి నిధుల సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన.

నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి

స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయలు కొట్టి, ప్రారంభించారు.

ఎమ్మెల్సీ కోటి రెడ్డి గారు మాట్లాడుతూ.

కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో.

అనుముల మండలం ఎంపీపీ సుమతీ పురుషోత్తం, తిరుమలగిరి సాగర్ మండలం ఎంపీపీ భగవాన్ నాయక్, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రావుల చిన్న బిక్షం యాదవ్, స్థానిక మూడో వార్డు కౌన్సిలర్ అన్నపాక శ్రీనివాస్, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం అధ్యక్షులు వర్ర వెంకటరెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు రామకృష్ణ, రమేష్ జి,ఆదాసు విక్రమ్, మోహన్ నాయక్, అనుముల మండల మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజు యాదవ్,నాయుడుపాలెం సర్పంచ్ కిరణ్ నాయక్, కొట్టాల సర్పంచ్ చింతకాయల యా వెంకటేశ్వర్లు, వీర్ల గడ్డ తండా సర్పంచ్ సంధ్యా రాము నాయక్,జిల్లా ఎంపీటీసీల పోరం అధ్యక్షులు రావుల రాంబాబు యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఆవుల సైదులు యాదవ్, మదారి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్ము సైదులు యాదవ్, మాజీ పేరూరు దేవస్థానం కమిటీ చైర్మన్ మనది పురుషోత్తం యాదవ్, ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ గౌస్, ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పశువుల ప్రసాద్ యాదవ్, పసుల శ్రీనివాస్ యాదవ్, దుండిగల శ్రీను, జిల్లా మైనార్టీ నాయకులు అబ్దుల్ హలీం, అంజద్ ఖాన్, అజారిగూడెం ఉపసర్పంచ్ జలీల్ ఖాన్, వీర్లగడ్డ తండా ఉపసర్పంచ్ మనది శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, కొట్టాల శ్రీను, భీమా నాయక్, ప్రభాకర్ నాయక్, సీకేయూత్ అధ్యక్షులు బండి రమేష్, 12వ వార్డు ఇన్చార్జి గోపిశెట్టి సైదులు,తెలంగాణ ఉద్యమ నాయకులు మధుచారి, మక్బూల్, జిల్లా టిఆర్ఎస్ మహిళా నాయకురాలు గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.

పలువురికి ఆర్ధిక సహాయం చేసిన కంచర్ల భూపాల్ రెడ్డీ

ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన గడ్డికొండారం గ్రామానికి చెందిన పాలడుగు సరిత, వీరమళ్ళ శంకరయ్య గార్లకు కంచర్ల భూపాల్ రెడ్డి MLA గారు 10000 వేలు చొప్పున ఆర్ధిక సహాయం చేసినారు.

ఈ కార్యక్రమం లో తిప్పర్తి TRS పార్టీ మండల అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, DCCB డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వర్ రావ్, లొడంగి గోవర్ధన్, సర్పంచ్ కంచర్ల భాస్కర్ రెడ్డి.

ఉప సర్పంచ్ భీమనపల్లి సైదులు, మైనం యుగందర్ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు మేరెడ్డి యాదగిరి రెడ్డి, సుంకిశాల రవి.

వార్డ్ మెంబెర్స్ కంచుకొమ్ముల సైదులు, మైనం లింగయ్య, దూదిమెట్ల లింగస్వామి,కంచర్ల కొండల్ రెడ్డి,మైనం కొండయ్య, కంచర్ల పురుషోత్తం రెడ్డి,కంచర్ల రమణ రెడ్డి, భీమనపల్లి శ్రీను, కస్పరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.