ఎన్నికలలో పోటీ చేయడానికి సిపిఎం సన్నద్ధం
జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి వర్గ సభ్యులు వెల్లడి
రాబోయే ఎన్నికలలో సిపిఎం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమని కార్యకర్తలను సమయత్తం చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై రంగారెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల బిజెపి పాలనలో దేశం అధోగతి పాలయిందని అన్నారు దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని దేశంలో మత ఉన్మాదపు చర్యలకు పాల్పడ్డారని దేశాన్ని ఆదాని అంబానీ లాంటివి పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలని ధారాధత్వం చేశారని అన్నారు. కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజల హక్కులను కాల రాశారని అన్నారు ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను బిజెపి ప్రభుత్వం తుడిచి పెట్టేసిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దేశంలో రెండు పూటలా తిండి తినలేని పరిస్థితులకి పేదలని నెట్టివేసిందని ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించలేదని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట చెప్పి నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని అన్నారు దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ సెక్యులర్ ప్రజాస్వామ్యం పదాలను తొలగించి ప్రశ్నించే వారిపైన దాడులకు ఉసిగొలుపుతుందని అన్నారు.
మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని తుంగలో తొక్కిందని డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించిందని జ్యోతిష్యము మూఢనమ్మకాలు లాంటి పాఠాలలో ప్రవేశపెట్టడం దౌర్భాగ్యస్థితికి నిదర్శనం అని అన్నారు. భారతదేశంలో పత్రిక మీడియా స్వేచ్ఛలను హరించి వేసిందని అక్రమ దాడులు కొనసాగిస్తూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జర్నలిస్టులను జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నించారు వామపక్ష భావజాలం ఉన్న నాయకుల ఇండ్లపై దాడులు చేస్తూ భయపతాన్ని సృష్టిస్తుందని అన్నారు. సనాతన ధర్మం పేరా ప్రజలను అణిచి వేయడానికి ఉపయోగపడే చర్యలకు పూనుకుంటుందని అన్నారు ప్రజలు రాబోయే ఎన్నికలలో బిజెపి మతోన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వేల శిలాఫలకాలు ఏమిటని ప్రశ్నించారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందారని అన్నారు నిరుద్యోగులకు నిరాశ చూపారని ఉద్యోగ నియామకాలలో అసంబద్ధమైన నిర్ణయాల వలన యువత అయోమయానికి గురయ్యారని టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు ప్రాణప్రదమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి నిధులు కేటాయించకపోవడం దానిని పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి మూలమని తెలిపారు ప్రజల చేతుల్లో ఉన్న భూములను పట్టాలివ్వకుండా ధరణి పేరా తొక్కి పెడుతున్నారని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాసన్ పట్టణ కార్యదర్శి ఎం డి సలీం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణ రెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మండల కార్యదర్శిలు నలుపరాజు సైదులు మన్నెం బిక్షం కందుల సైదులు శ్రీకర్ జిల్లా అంజయ్య కొండ వెంకన్న దొండ కృష్ణారెడ్డి దండంపల్లి సరోజ బొల్లోజు భారత కానుగు లింగస్వామి యాదయ్య గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
పాలడుగు నాగార్జున నల్లగొండ
Oct 10 2023, 11:26