/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కోతులకు విషం పెట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు Yadagiri Goud
కోతులకు విషం పెట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. సర్పంచ్‌, అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో మూగజీవాలను మట్టుపెట్టింది ఎవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలికారు.

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం

అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది మృతి చెందగా వెయ్యి మంది వరకు గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3 ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు.

భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద మృతదేహాలు ఉండొచ్చిన స్థానిక మీడియా వెల్లడించింది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటి పలు భవనాలు కుప్పకూలిపోయాయి.

భూ ప్రకంపనలు ఐదు సార్లు చోటుచేసుకున్నట్టు సమాచారం. హెరాత్ సిటీకి 40 కిలో మీటర్ల దూరం భూకంప కేంద్ర ఉన్నట్టు భూపరిశోధన అధికారులు వెల్లడించారు.

బాడ్‌ఘీష్, ఫరాహ ప్రోవిన్స్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు సమాచారం. అధికారులు, రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టు,లలో రేపు చంద్రబాబు కేసు విచారణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటీషన్‌లపై సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టు విజయవాడ ఏసీబీ కోర్టు లలో తీర్పులు, విచారణ జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో రేపు హాట్ మండే గా మారనుంది. అలాగే హై కోర్టులో చంద్రబాబు పిటీషన్లపై కూడా సోమవారం తీర్పు రానుంది. అంగాళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో బెయిల్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌లపై హై కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఇప్పటికే ఈ మూడు కేసుల్లో వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.

సోమవారమే సుప్రీం కోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై విచారణ జరగనుంది.

అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు వెలువడనుంది. ఈ పిటీషన్‌లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కాగా హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, ముందస్తు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి.

కాగా రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు హాట్ మండేగా మారనుంది..

తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆదివారం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్‌ నుంచి భక్తులను పంపుతున్నారు.

స్వామివారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పుష్ప పల్లకి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది.

ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త జన సందోహంతో కాణిపాకం పురవీధులు కిటకిటలాడుతున్నాయి.....

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

ఖానాపూర్ పట్టణంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఆమె వెల్లడించారు.

నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వరాజీనామా పత్రాలను పార్టీకి త్వరలో పంపుతాను అన్నారు. కేవలం కేటీఆర్ మిత్రుడు ను టికెట్ ఇచ్చేందుకు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని నిలిపి వేశారాణి ఆరోపించారు..

మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? కుంభకోణాలకు పాల్పడ్డానా? టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన జాన్సన్ ఎస్టీ కానే కాదన్నారు.

కేటీఆర్ మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఖానాపూర్ నియోజకవర్గం గురించి ఆయనకి ఏం తెలుసని మండిపడ్డారు . మొన్నకి మొన్న నిర్మల్లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సభ ఫ్లెక్సీలో త‌న ఫోటో పెట్టలేదని అన్నారు, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీకి బరిలో ఉంటాన‌ని, ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెప్తాను అన్నారు .

ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు.

రేపటి నుంచి ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి వరకు నియోజకవర్గ మొత్తం పాదయాత్ర చేస్తానని అన్నారు...

22 రోజుల తర్వాత తల్లిని కలిసిన నారా లోకేష్

నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

అంతకు ముందు విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు.

చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్‌ను కలుసుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భావోద్వేగానికి గురైయ్యారు.

కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

బంజారాహిల్స్‌: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్‌ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు..

ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్‌, నరేందర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది..

Nara Brahmani: చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు: నారా బ్రాహ్మణి ట్వీట్‌

అమరావతి: చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) అన్నారు..

చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

''మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు.

కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?

అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం.

రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం'' అని బ్రాహ్మణి పేర్కొన్నారు..

Assembly elections: అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. అక్టోబర్‌ 8-10 మధ్య షెడ్యూల్‌ ప్రకటన?

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం (EC) ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి..

ఈ ఏడాది తెలంగాణ(Telangana), రాజస్థాన్‌(Rajasthan), మిజోరం(Mizoram), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి.

తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి..

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు దిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది.

ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం తెలిసిందే..

Breakfast Scheme: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులతో టిఫిన్‌ చేసిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారం అందించే లక్ష్యంగా సర్కార్‌ తీసుకొచ్చిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది..

వివిధ జిల్లాల్లో ఈ పథకాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

అల్పాహార పథకం పేద పిల్లలకు వరమన్న మంత్రులు.. మఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణం ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిని.. కాసేపు వారితో ముచ్చటించారు. వారికి మంత్రి కేటీఆర్‌ అల్పాహారాన్ని వడ్డించారు. విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రోజుకో పౌష్టికాహారాన్ని వడ్డించనున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమన్నారు..