రేపటి నుండే అందుబాటులోకి మహాప్రస్థానం సేవలు
అత్యాధునిక వసతులు..ఆధునిక సౌకర్యాలతో పార్క్ ని తలపిస్తున్న మహాప్రస్థానం
మహాప్రస్థానంలో కాటికాపర్లతో సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి
అంతిమ సంస్కారాల రుసుము 6 వేలు గా నిర్ణయం
రేపటి నుంచి ప్రారంభం కానున్న కార్యకలాపాలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం
భూతల స్వర్గాన్ని తలపిస్తున్న సూర్యాపేట లోని మహా ప్రస్థానం సేవలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. సకల వసతులు, అత్యాధునిక సౌకర్యాలతో రూ.. 4.20 కోట్ల తో ఆదునికరించిన మహాప్రస్థానం సేవలకు సిద్ధంగా ఉంది..
అంత్యక్రియల రుసుము 6 వేలు గా నిర్ణయం
సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద వద్ద ఉన్న మహాప్రస్థానం గతం లో సౌకర్యాల లేమీ తో ప్రజలు ఇబ్బందులు పడేవారు.. ఇక అంత్యక్రియలు నిర్వహించాలంటే జేబులు గుల్ల అయ్యేవి. మంత్రి జగదీష్ గారు తీసుకున్న నిర్ణయం, చొరవ తో మహా ప్రస్థానం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకే రుసుము తో అది కూడా అందుబాటు లో ఉండే విధంగా మహాప్రస్థానం లో కాటి కాపరులతో సమావేశం అయిన మంత్రి జగదీష్ రెడ్డి, అంత్యక్రియల ఫీజు 6 వేలు గా నిర్ణయించారు.. ఈ ఫీజు రాష్ట్రం లోనే సూర్యాపేట లోనే అతి తక్కువ కావడం మరో విశేషం..
కిరాయి దారులకు సౌకర్యం గా అద్దె కాటేజ్ లు
అద్దె ఇళ్ళ లో ఉండే వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఎదుర్కొనే సమస్య వర్ణాతీతం. యజమానులు పార్థివదేహన్ని ఉంచకూడదని పెట్టే షరతులు ఒక వైపు, భౌతిక కాయాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి మరోవైపు అష్ట కష్టాలు పడేవారు.కిరాయి దారుల సమస్యలను గుర్తించిన మంత్రి అటువంటి అభాగ్యుల కోసం మహాప్రస్థానంలో చనిపోయినాటినుండి కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఉండి జరిపించుకునేందుకు వీలుగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అతి తక్కువ ఫీజుతో పదిమంది కుటుంబ సభ్యులు ఉండేలా రెండు కాటేలను సిద్ధం చేశారు.
Oct 05 2023, 19:31