దేవాలయాలకు ఐటి నోటీసులు
తెలంగాణ దేవుళ్లకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. నిజమే తెలంగాణలో ప్రముఖ దేవులందరికి ఐటి శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో దేవుళ్ళకే ఐటీ నోటీసులు అన్న చర్చ ప్రారంభమైంది.
ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వటంతో సంచలనం గా మారింది. ప్రముఖ దేవస్థానం కొమురవెల్లి మల్లన్నకు రూ.11 కోట్లు కట్టాలంటు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.
కొమురెల్లి మల్లన్న దేవాలయానికి కాదు తెలంగాణలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న టెంపుల్ తో పాటు చదువుల నిలయమైన బాసర సరస్వతి ఆలయానికి సైతం నోటీసులు పంపింది ఆదాయపన్ను శాఖ.
దేవాలయా లే టార్గెట్
తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది.
ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వేములవాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి.
మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..
Oct 05 2023, 14:31