డేట్ మారిన జోష్ తగ్గని నాయకుడు అర్ధరాత్రి దాటి ఒకటి అవుతున్నా సంక్షేమ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన మంత్రి
వర్తమాన రాజకీయాలలో ప్రజాప్రతినిధి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, ఒక క్రేజ్ ను కల్పించి, యువత సైతం ఆకర్షితులు అయ్యేలా చేయటం అంటే అంత అషామాషీ కాదు.
సూర్యాపేట నియోజక వర్గం కోసం రోజుకు 18 నుండి 20 గంటల పాటు ఆయన పడుతున్న శ్రమతో అసాధ్యాలెన్నో సుసాధ్యం అయ్యాయి. రాజకీయాలకు ఒక హుందాతనాన్ని, పవిత్రతను చేకూర్చారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. మంత్రి గా నల్లగొండ జిల్లా బాధ్యతలను బుజస్కందాలపై మోస్తూనే , తన దేవాలయం లాంటి సూర్యాపేట లో అర్ధరాత్రి కూడా పాలన సాగిస్తూ పుట్టినిల్లుపై తన మమకారాన్ని చాటుతున్నారు. నల్లగొండ జిల్లాలో దేవరకొండ మునుగోడు, నకిరేకల్లు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రికి, తన సొంత నియోజకవర్గం సూర్యాపేటకు వచ్చేసరికి రాత్రి అయింది. రాత్రి అయింది కదా అలసిపోయి ఉంటారు ప్రోగ్రామ్స్ ఉండవు అని అధికారులు ,
బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పు అనే విధంగా రాత్రి 9 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 12 దాటి తేదీ మారి ఒంటిగంట అవుతున్నా కొనసాగుతూనే ఉన్నాయి.మూర్తీభవించిన మానవత్వానికిప్రతిరూపం..అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ బిజెపిలను వీడి బీఆర్ఎస్ లో చేరడానికి వచ్చిన ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామానికి చెందిన వందలాది మందికి కండువాతో స్వాగతం పలికారు. అనంతరం వెనుకబడిన తరగతులకు చెందిన కులవృత్తుల వారికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయం నకు సంబంధించి చెక్ లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా సూర్యాపేట రూరల్ మండలం కాసరబాద్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో 10 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను , బతుకమ్మ ఘాటును ప్రారంభించారు. అక్కడి నుండి ఇమాంపేట గ్రామానికి వెళ్లి 15 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన ను ప్రారంభించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని కార్యాలయానికి వచ్చేసరికి ఒంటిగంట అయినా, తమ అభిమాన నేతను కలుసుకొని ఆయనకు కష్టాలను చెప్పుకోవడానికి క్యాంప్ కార్యాలయం వద్ద వేచి ఉన్న సందర్శకులతో భేటీ అయ్యారు. ఒకోక్కరితో మాట్లాడుతూ వారి ఇబ్బందులను తెలుసుకుని వాటి కావాల్సిన పరిష్కారాలను సూచించారు. మొత్తంగా ఉదయం 6 గంటలకు మొదలైన మంత్రి జగదీశ్ రెడ్డి గారి విధి నిర్వహణ రాత్రీ ఒంటి గంట అయినా ఇంకా కొనసాగుతుంది.. బీఆర్ఎస్ బరువును, పరువును తన భుజస్కందాలపై వేసుకొని ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం నలు వైపులా కలియ తిరుగుతున్న అలుపెరుగని శ్రామికుడు జగదీష్ అన్న అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
Oct 05 2023, 11:49