మంత్రి కేటీఆర్ పర్యటన కోసం విద్యార్థులను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టడం అమానుష
నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ భవనాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనల కోసం నేడు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా పూలు చల్లుతూ స్వాగతం పలకడానికి స్కూల్ పిల్లలను గంటల తరబడి రోడ్డుకు పూట్ పాత్ లపై నిలబెట్టడం అవివేకం అని నిరంకుశత్వానికి,నియంతృత్వ పోకడకు నిదర్శనాలని PDSU జిల్లా ఇంచార్జి ఇందూరు సాగర్,జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు
స్థానిక PDSU జిల్లా కార్యాలయం (శ్రామిక భవనం)లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ....మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలకడానికి మైనర్ బాల,బాలికలను ఫుట్ పాత్ లపై నిలబెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అన్నారు.
మహాత్మా గాంధీ జయంతి రోజు విద్యార్థుల హక్కులను కాలరాయడం అవివేకం అని ప్రశ్నించారు.రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో విద్యార్థులకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమి లేదని,విద్యావ్యవస్థ బ్రష్టు పట్టిందని అన్నారు,5 వేల కోట్లకు పైగా స్కాలర్ షిప్స్,రియంబర్స్ మెంట్స్ చెల్లించపోవడంతో విద్యార్థుల ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని మండి పడ్డారు.
ప్రభుత్వ విధానాల వలన వందలాది ప్రభుత్వ పాఠశాలలు,బి.ఈ.డి,డిగ్రీ,ఇంటర్,ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు మూతబడ్డాయని అన్నారు.నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయిందని దుయ్యబట్టారు.ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు.కార్పొరేట్ యూనివర్సిటీ లకు తలుపులు బార్లాతెరవడంతో ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని తెలిపారు.హాస్టల్ పెంచిన కొద్దిపాటి మెస్ చార్జీలను కూడా పేపర్ కె పరిమితం చేశారని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలు,అవకతవకలేనని అన్నారు.చేసిన అభివృద్ధి గోరంత,ప్రచారం కొండంత ఉన్నదని అన్నారు.పట్టణలో డివైడర్ లను మూసి వాహన దారులను,ప్రజలను,విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు..
Oct 05 2023, 11:44