అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్:రేమా రాజేశ్వరి
జల్సా లకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులకు అంతు చిక్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు.
గతవారం 24 వ తేదీన ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు విషయం బయటపడింది
ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి సరఫరా చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. చేసేది లేక నిందితులు వాహనం వదిలేసి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న ట్రాక్టర్ ను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా
ట్రాక్టర్ పైన ఇటుకల ఉంచి క్రింద భాగాన ఉంచిన 93 బ్రౌన్ కలర్ గంజాయి ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి రమా రాజేశ్వరి తెలిపారు.
బుధవారము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి రేమా రాజేశ్వరి నిందితుల వివరాలు వెల్లడించారు.
1 ఈశ్వర్, 2,జగబంధు 3,క్రిశాని,4,గురు, అనే నిందితులు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో సరిహద్దు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారని ఆమె అన్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిధులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రామగుండం సీపీ రేమా రాజేశ్వరి తెలిపారు.. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సుధీర్, రాం నాథ్, కేకన్ ఐపీఎస్, డీసీపీ మంచిర్యాల, మోహన్ ఏసిపి, జైపూర్ నిందితులను పట్టుకోవడానికి సహకరించిన అధికారులందరినీ రేమా రాజేశ్వరి అభినందించారు...
Sep 28 2023, 10:28