CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివా
దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివాసం మరమ్మతుల కోసం కోట్ల రూపాయాలు వెచ్చించారని భాజపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే..
తాజాగా ఈ వివాదంపై సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry) ప్రారంభించింది. అధికారిక నివాసం మరమ్మతుల్లో 'అక్రమాలు, ఉల్లంఘనలపై' వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ ప్రాథమిక దర్యాప్తు (PE)ని నమోదు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు..
దిల్లీ ప్రభుత్వంలో గుర్తించని ప్రజాసేవకులపై సీబీఐ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ (PE)ని నమోదు చేసింది.
ప్రాథమిక విచారణ అనేది.. వచ్చిన ఆరోపణలపై రెగ్యులర్ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుంది.
ఈ క్రమంలోనే అధికారిక నివాసం మరమ్మతులకు సంబంధించిన రికార్డులను సదరు శాఖ నుంచి అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెండర్ దస్త్రాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, నిర్మాణ అనుమతులు, తదనంతరం మార్బుల్ ఫ్లోరింగ్‌లో మార్పులు ఇతర పనుల వివరాలను కోరినట్లు అధికారులు వెల్లడించారు..
Sep 27 2023, 21:53