/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కరీంనగర్ లో భారీ ర్యాలీ ప్రారంభించిన: మంత్రి గంగుల Yadagiri Goud
కరీంనగర్ లో భారీ ర్యాలీ ప్రారంభించిన: మంత్రి గంగుల

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోభారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందు ఈ ప్రదర్శన జరిగింది...

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి

సంగారెడ్డిజిల్లా:

టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఈరోజు ఉదయం జరిగింది.

సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.

ఈ క్రమంలో బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే రాధిక పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్‌ తీసుకెళ్లారు.

అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలు పంపిణీ: మంత్రి జగదీష్ రెడ్డి

ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

సూర్యాపేటను పర్యావరణహితమైన పట్టణంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. వినాయక నవరాత్రి పూజలను పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు శుక్రవారం మట్టి విగ్రహాలను అందజేశారు.

మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలో సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పారు.

ప్లాస్టిక్‌ నివారణ విషయంలో కూడా సూర్యాపేట ముందుండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్లాస్టిక్‌తో ముప్పు పొంచి ఉన్నదని, ప్లాస్టిక్‌ నివారణ కోసం మనం చేయగలిగిన మేలు చేయాలని మంత్రి సూచించారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మంత్రి తెలిపారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని, అందుకే మట్టి విగ్రహాలు పెట్టుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతున్నదని చెప్పారు.ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేశారని, ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని, అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు...

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ

తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజులు 16, 17 తేదీల్లో, హైదరాబాద్‌ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు..

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, , ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర సీనియర్లతో కలిపి దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఇప్పటీ వరకు ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం వార్‌రూమ్‌లో జరిగే ఈ సమావేశం.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుండటంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

పార్టీ అగ్రనాయకత్వం అంతా రాష్ట్రానికి రావడం, కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నతంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పకడ్బందిగా ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో వీఐపీకి పీసీసీ నుంచి ఒక డెలిగెట్‌ను ఏర్పాటు చేశారు. ఏయిర్‌పోర్టు నుంచి దిగినప్పటికి నుంచి సమావేశానికి హాజరకావడం, తిరిగి వెళ్లే వరకు పీసీసీ కేటాయించిన నాయకులు చూసుకునే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో కాంగ్రెస్‌ అధిష్టానం ఏఐసీసీ ప్లీనరీని నిర్వహించింది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఇప్పుడు హైదరాబాదులో నిర్వహిస్తున్నారు...

నేడు టెట్’ పరీక్ష: సర్వం సిద్ధం చేసిన అధికారులు

టీచర్ ఎలిజిబులిటీ టెట్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది.

మొత్తం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్ 1 కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అప్లికేషన్ చేసుకున్నారు.

పేపర్ 1 నిర్వహణకు 1139 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. పేపర్ 2కు 913 సెంటర్లు సిద్ధం చేశారు. మొత్తం 2052 కేంద్రాలకు గాను 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2052 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.

నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. పారదర్శకంగా నిర్వహించేందుకే సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వైద్యం, రవాణాకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు...

శ్రావణ శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది.

నేడు శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా గురువారం స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.......

రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు

తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు.గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈడీ నోటీసులు అందాయని క‌విత తెలిపారు. నోటీసుల‌ను పార్టీ లీగ‌ల్ సెల్‌కు అంద‌జేశాం. వారి సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తాం. రాజ‌కీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిన‌ట్లు బ‌లంగా న‌మ్ముతున్నాం. తెలంగాణ‌లో రాబోయే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న‌కు నోటీసులు ఇచ్చారు.

గ‌త ఏడాది కాలం నుంచి ఆ కేసులో ద‌ర్యాప్తు జరుగుతోంద‌ని, ఇంకెన్నాళ్లు ఆ విచార‌ణ ఉంటుందో త‌న‌కు తెలియ‌దు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జ‌ర‌గ‌లేద‌నుకుంటా. రాజ‌కీయ ఉద్దేశంతోనే కేసు సాగుతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు దీన్ని సీరియ‌స్‌గా తీసుకోరు. పార్టీ లీగ‌ల్ బృందం ఇచ్చే స‌ల‌హాల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు.

తాము ఏ పార్టీతోనూ క‌ల‌వ‌లేద‌ని, కేవ‌లం తెలంగాణ ప్ర‌జ‌లు, భార‌త దేశ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌న్నారు. దేశ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ను కావాల‌నుకుంటున్నార‌ని, దీంతో ఆ రెండు పార్టీల‌కు ఆ భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

మేం ఎవ‌రికీ బీ టీమ్ కాద‌న్నారు. అంతులేని టీవీ సీరియ‌ల్ త‌ర‌హాలో విచార‌ణ సాగుతున్న‌ద‌ని, అదేమీ పెద్ద విష‌యం కాద‌న్నారు. బీజేపీ ఎన్నిక‌ల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌జ‌లే ఆ పార్టీకి బుద్ధి చెబుతార‌ని క‌విత పేర్కొన్నారు...

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

డ్రగ్స్ కేసులో నవదీప్ కస్టమర్‌గా ఉన్నాడని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ కోసం వెదుకుతున్నామన్నారు. అలాగే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేశామని సీవీ ఆనంద్ తెలిపారు.

అయితే తాను పరారీలో లేనని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నవదీప్ మీడియాకు చెబుతున్నట్లు తెలిసింది. తాను షూటింగ్ లో ఉన్నానని కూడా ఆయన చెప్పడం విశేషం. తాను ఒక సాంగ్ రిలీజ్ లో ఉన్నానని నవదీప్ అంటున్నారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు వినిపించింది.

బేబీ సినిమా పై సీపీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఆ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహిస్తూ తీయడం సరికాదన్నారు. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామన్న ఆయన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

స్మార్ట్ పబ్ ఓనర్ సూర్యతో పాటు అర్జున్, సినీ నిర్మాత రవి ఉప్పలపాటి, శ్వేత, కార్తీక్ లు కూడా పరారీలో ఉన్నారని, వారందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు వెళ్లాయన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. వారి సెల్ ఫోన్ లు స్విచాఫ్ చేసుకుని కుటుంబాలతో సహా పరారయ్యారని సీవీ ఆనంద్ తెలిపారు..

గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్లు ఆమోదించడం సంతోషకరం: మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులని, గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లు ఆయోదించటం సంతోషమని మంత్రి హరీష్ రావు అన్నారు.

గురువారం ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని, పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, ప్రతిపక్షాలు ప్రజలకు పగోళ్ళు పని చేస్తున్నారని... పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని.. రాబోయే ఎన్నికలలో నోబెల్స్‌కు గ్లోబెల్స్‌కు మధ్య పోటీ జరగబోతోందని అన్నారు.

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణే నంబర్ వన్ అని హరీష్ రావు అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏంచేస్తున్నారు?.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫథకాలలో ఒక్కటైనా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని నిలదీశారు.

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. సీతారామ ఎత్తిపోతల పనులు చివరి దశలో ఉన్నాయని, మరో మూడు నెలలో పూర్తి అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో కృష్ణా, గోదావరి జలాలతో ఇక కరువనేదే ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు.

బిఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లిమోహన్ రాజీనామా?

కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

అధికార పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, నాటి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థన మేరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ సహకారం అవుతుందని భావించానని చెప్పారు.

తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బీసీలు, దళితులకు పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడాలనే తపనతో ప్రజల గొంతుకగా మారాలనే ఉద్దేశంతో, అధికార పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.