/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు Yadagiri Goud
రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు

తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు.గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈడీ నోటీసులు అందాయని క‌విత తెలిపారు. నోటీసుల‌ను పార్టీ లీగ‌ల్ సెల్‌కు అంద‌జేశాం. వారి సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తాం. రాజ‌కీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిన‌ట్లు బ‌లంగా న‌మ్ముతున్నాం. తెలంగాణ‌లో రాబోయే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న‌కు నోటీసులు ఇచ్చారు.

గ‌త ఏడాది కాలం నుంచి ఆ కేసులో ద‌ర్యాప్తు జరుగుతోంద‌ని, ఇంకెన్నాళ్లు ఆ విచార‌ణ ఉంటుందో త‌న‌కు తెలియ‌దు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జ‌ర‌గ‌లేద‌నుకుంటా. రాజ‌కీయ ఉద్దేశంతోనే కేసు సాగుతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు దీన్ని సీరియ‌స్‌గా తీసుకోరు. పార్టీ లీగ‌ల్ బృందం ఇచ్చే స‌ల‌హాల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు.

తాము ఏ పార్టీతోనూ క‌ల‌వ‌లేద‌ని, కేవ‌లం తెలంగాణ ప్ర‌జ‌లు, భార‌త దేశ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌న్నారు. దేశ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ను కావాల‌నుకుంటున్నార‌ని, దీంతో ఆ రెండు పార్టీల‌కు ఆ భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

మేం ఎవ‌రికీ బీ టీమ్ కాద‌న్నారు. అంతులేని టీవీ సీరియ‌ల్ త‌ర‌హాలో విచార‌ణ సాగుతున్న‌ద‌ని, అదేమీ పెద్ద విష‌యం కాద‌న్నారు. బీజేపీ ఎన్నిక‌ల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌జ‌లే ఆ పార్టీకి బుద్ధి చెబుతార‌ని క‌విత పేర్కొన్నారు...

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

డ్రగ్స్ కేసులో నవదీప్ కస్టమర్‌గా ఉన్నాడని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ కోసం వెదుకుతున్నామన్నారు. అలాగే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేశామని సీవీ ఆనంద్ తెలిపారు.

అయితే తాను పరారీలో లేనని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నవదీప్ మీడియాకు చెబుతున్నట్లు తెలిసింది. తాను షూటింగ్ లో ఉన్నానని కూడా ఆయన చెప్పడం విశేషం. తాను ఒక సాంగ్ రిలీజ్ లో ఉన్నానని నవదీప్ అంటున్నారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు వినిపించింది.

బేబీ సినిమా పై సీపీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఆ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహిస్తూ తీయడం సరికాదన్నారు. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామన్న ఆయన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

స్మార్ట్ పబ్ ఓనర్ సూర్యతో పాటు అర్జున్, సినీ నిర్మాత రవి ఉప్పలపాటి, శ్వేత, కార్తీక్ లు కూడా పరారీలో ఉన్నారని, వారందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు వెళ్లాయన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. వారి సెల్ ఫోన్ లు స్విచాఫ్ చేసుకుని కుటుంబాలతో సహా పరారయ్యారని సీవీ ఆనంద్ తెలిపారు..

గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్లు ఆమోదించడం సంతోషకరం: మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులని, గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లు ఆయోదించటం సంతోషమని మంత్రి హరీష్ రావు అన్నారు.

గురువారం ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని, పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, ప్రతిపక్షాలు ప్రజలకు పగోళ్ళు పని చేస్తున్నారని... పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని.. రాబోయే ఎన్నికలలో నోబెల్స్‌కు గ్లోబెల్స్‌కు మధ్య పోటీ జరగబోతోందని అన్నారు.

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణే నంబర్ వన్ అని హరీష్ రావు అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏంచేస్తున్నారు?.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫథకాలలో ఒక్కటైనా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని నిలదీశారు.

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. సీతారామ ఎత్తిపోతల పనులు చివరి దశలో ఉన్నాయని, మరో మూడు నెలలో పూర్తి అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో కృష్ణా, గోదావరి జలాలతో ఇక కరువనేదే ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు.

బిఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లిమోహన్ రాజీనామా?

కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

అధికార పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, నాటి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థన మేరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ సహకారం అవుతుందని భావించానని చెప్పారు.

తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బీసీలు, దళితులకు పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడాలనే తపనతో ప్రజల గొంతుకగా మారాలనే ఉద్దేశంతో, అధికార పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

టి ఎస్ ఎడ్ సెట్,పి ఈ సెట్ షెడ్యూల్ విడుదల!!

టీఎస్ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఈ షెడ్యూల్‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఎస్‌కే మ‌హ్మ‌ద్, సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ ఎన్ శ్రీనివాస్ రావు, ఎడ్‌సెట్, పీఈసెట్‌ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ పీ రమేశ్ బాబు క‌లిసి విడుద‌ల చేశారు.

కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఈ నెల 19న విడుద‌ల చేయ‌నున్నారు. ఎడ్‌సెట్ ప్ర‌వేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను 20వ తేదీ నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్య‌ర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ 25 నుంచి 29వ తేదీ మ‌ధ్య‌లో ఉంటుంది. వెబ్ ఆప్ష‌న్స్ అక్టోబ‌ర్ 3 నుంచి 5వ తేదీ వ‌ర‌కు న‌మోదు చేసుకోవాలి.

అక్టోబ‌ర్ 6న వెబ్ ఆప్ష‌న్ల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఫ‌స్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు అక్టోబ‌ర్ 9న జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 10 నుంచి 13వ తేదీ మ‌ధ్య‌లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 30వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమంట్ వంటి అంశాలు 20 నుంచి 25వ తేదీ మ‌ధ్య‌లో జ‌ర‌గ‌నున్నాయి.

సెప్టెంబ‌ర్ 24 నుంచి 25వ తేదీ మ‌ధ్య‌లో ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్య‌ర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ ఉంటుంది. సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఈ నెల 30వ తేదీన వెబ్ ఆప్ష‌న్ల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అక్టోబ‌ర్ 3వ తేదీన ఫ‌స్ట్ ఫేజ్ సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబ‌ర్ 4 నుంచి 7వ తేదీ మ‌ధ్య‌లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది...

మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కలిసిన పిడమర్తి రవి

హైదరాబాద్:

హైదరాబాదులోని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఆర్ దామోదర్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు పెడమర్తి రవి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆర్ దామోదర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని పిడమర్తి రవి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్ దామోదర్ రెడ్డి రాజకీయంగా ఉన్నంత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసే ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ నియోజక వర్గం బీసీలకు త్యాగం చేస్తానని మాట తప్పిన వెంకట్ రెడ్డి.

•వెంకట్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ విద్యార్థి సంఘం..

•నల్లగొండలో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

•బీసీలకు ఇచ్చిన మాట తప్పితే చిత్తుచిత్తుగా ఓడిస్తాం..

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజక వర్గం నుండి నాలుగు పర్యాయాలు గెలుపొంది తదననంతరం ఓడిపోయిన క్రమంలో భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొంది మళ్లీ నల్లగొండ నియోజక వర్గం తన సామంతరాజ్యంగా, ఈయన గట్టిన కోట బురుజులా మాట్లాడుతున్నారని ఇలాంటి పద్ధతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ హెచ్చరించారు.

నల్లగొండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ బీసీలకు త్యాగం చేస్తానని చెప్పి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నల్లగొండ పట్టణంలో గడియారం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ నియోజక వర్గాన్ని బీసీలకు త్యాగం చేస్తానని చెప్పి ఈరోజు మాట మార్చి నేనే 50 వేల మెజార్టీతో గెలువబోతున్నానని ప్రగల్బాలు పలకడం బీసీల పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడంలో వెంకట్ రెడ్డి దిట్ట అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఏనాడు బీసీలపై ప్రేమ లేదన్నారు తన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక జెడ్పిటిసి స్థాయికి ఎదిగితే ఎంపీటీసీగా పోటీ చేయించి ఓడగొట్టిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అన్నారు.

వెంకట్ రెడ్డి కడుపులో కత్తులు పెట్టుకొని భయటికి బీసీల పట్ల జపం చేస్తున్నారని వారన్నారు. భువనగిరి నియోజకవర్గం లాంటి చోట్ల బీసీలను అడ్డం పెట్టుకొని గెలిచే అభ్యర్థులను కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టిన చరిత్ర వెంకట్ రెడ్డి అన్నారు.బట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వచ్చిన సందర్భంలో ఆహ్వానం పలికి వేదికపైకి ఎక్కిన డాక్టర్ చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమ నేతలను తన అనుచరుల ప్రోద్భలంతో కిందికి దింపించిన దుర్మార్గపు చరిత్ర వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో గాని నల్లగొండ జిల్లాలో గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సంబంధించిన ఆధిపత్య వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఏనాడు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి బి.సిలను ఎదగనీయలేదు అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ది నల్లగొండ జిల్లాలో బీసీలను అణిచివేసిన చరిత్రే కానీ ఎదగనిచ్చిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. నకిరేకల్ లాంటి ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో అనేక మందికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దండుకున్న రాజకీయ దుర్మార్గుడు ఈయన గారు అన్నారు. అక్కడ గెలిచే అభ్యర్థి పార్టీలోకి వస్తానంటే ఈయన పెత్తనం కోసం అడ్డుకుంటున్నారని వారన్నారు.

గాలి మాటలు మాట్లాడకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నల్లగొండ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమందరం కలిసి వెంకటరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలోబీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్, మండల యాదగిరి యాదవ్, కొంపల్లి రామన్న గౌడ్ లక్ష్మణ్ యాదవ్, ఉపేందర్ యాదవ్ మహేష్ కుమార్ పృద్వి, శేఖర్, సాయికుమార్, విగ్నేష్ గౌడ్, చింటూ, రమేష్ యాదవ్, లింగస్వామి, ఊరుపక్క సాయి, బొంత రమేష్, చాకలి అంజి. తదితరులు పాల్గొన్నారు.

పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్ట పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.

అక్కడి నుండి తన మిత్రులతో కలిసి ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు.

వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

టి ఎస్ ఆర్ టి సి విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.

దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

యువతి విషయంలో గొడవ.. వివాదంలో మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ కుమారుడు!

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్‌ 10లో ఓ పబ్‌ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ యువతి విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు..

ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. పబ్‌లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కాసేపటి తరువాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు..