ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యార్థుల నిరుద్యోగుల ఆరాధ్య దైవం,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు మరియు ఆస్పత్రి సిబ్బందికి పండ్లు పంపిణీ కార్యక్రమం భారీగా చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ నిరుపేద ప్రజల కోసం 50 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింపజేసి ప్రభుత్వంపై పోరాడిన గొప్ప నాయకుడు ఆర్ కృష్ణన్న అని కొనియాడారు. అదేవిధంగా బలహీన వర్గాల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులను ఫ్రీగా చదువుకోవడం కొరకు ప్రభుత్వంపై అనేక దపాలుగా పోరాటాలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టించిన గొప్ప చరిత్ర ఆర్ కృష్ణ అన్నది అన్నారు.
అంతేకాకుండా నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయించిన చరిత్ర గల నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేరని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి రెండు వేలకు పైగా జీవోలు తెప్పించిన ఘన చరిత్ర ఆర్.కృష్ణన్నదని అలాంటి నాయకుడు ఇంకా ముందు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయనకు ఆయుష్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యా యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగుల నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, చింటూ యాదవ్, రాజు, హరికృష్ణ, జై పాలు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Sep 14 2023, 09:32