Nadendla Manohar: 144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా?: నాదెండ్ల మనోహర్
మంగళగిరి: ఏపీలో పోలీసులు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తొత్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై చేపట్టిన బంద్ విషయంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారని... కానీ, వైకాపా నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగారని ఆరోపించారు. గుంటూరులో మేయర్ కావటి మనోహర్ నాయుడు పోలీసు లాఠీతో జనసేన కార్యకర్తల్ని బెదిరించటాన్ని తప్పుబట్టారు.
144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కుట్రపూరితంగా అరెస్టు చేసింది నిజమేనని.. అందుకే రాష్ట్రంలో ప్రజలు ఇవాళ స్వచ్చందంగా బంద్ పాటించారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఇంటికి పోవటం ఖాయమని నాదెండ్ల దుయ్యబట్టారు.
Sep 11 2023, 21:04