ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే: చట్టపరమైన చర్యలు
గణేశ్ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్‌మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదంగా భావించిన పోలీసులు..
ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు సోషల్ మీడియా యాక్షన్ టీమ్ స్మాష్ పర్యవేక్షిస్తుంది. ప్రశాంతతను భంగం కల్గించే పోస్టులను గుర్తించి వాటిని వెంటనే తొలగించడంతో పాటు పోస్టు చేసిన వారిని పట్టుకుంటున్నారు.
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవ ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు 20 వేలకుపైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. పటిష్టమైన బందోబస్తును, పీస్ కమిటీ సమావేశాలతో ప్రజల్లో ఐక్యత చెదరకుండా చేస్తూ సోదర భావంతో వేడుకలు పూర్తయ్యే విధంగా చేస్తుంటారు.
కాని కొందరు తప్పుడు వార్తలు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ వాటిని సర్క్యూలేట్ చేసి, ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా, అలాంటి వాటితో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో సోషల్‌మీడియాపై పోలీసులు నిరంతరం ఫోకస్ పెడుతున్నారు...........
Sep 11 2023, 10:45