దేశంలోనే తెలంగాణ హోంగార్డులకు ఆర్థిక అభివృద్ధి
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ సర్కారు పోలీసులతో సమానంగా హోంగార్డులకు భద్రత కల్పిస్తున్నది.
ఈ విషయం తెలిసి కూడా కళ్లుండి చూడలేని కబోదుల్లా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో హోంగార్డు వ్యవస్థలను పర్మినెంట్ చేయకపోయినా.. తెలంగాణలో మాత్రం వెంటనే ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిస్సిగ్గుగా హోంగార్డులను రెచ్చగొడుతున్నారు.
ఇక వేతనాల విషయంలోనూ తెలంగాణ కంటే మెరుగ్గా బీజీపీ, కాంగ్రెస్ పాలిత వేతనాల విషయంలో ఒక్క పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల సీఎం కేసీఆర్, పోలీసుశాఖ ఉదారంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నో ఏండ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
2014లో రూ.9 వేలు.. నేడు రూ.27 వేలు
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ. 6 వేల జీతం మాత్రమే వచ్చేది. 2014 వరకూ వారి వేతనం రూ. 9 వేలే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మానావతా దృక్పథంతో 2014 డిసెంబర్ 5న హోంగార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పెంచిన జీతాలను 2015 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28ని రూ.100కు పెంచారు. ఆదివారాలు కూడా సెలవు లేకుండా, పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాన్ని 2017 డిసెంబర్ 13న రూ.12 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు.
మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి 30 శాతం పీఆర్సీ ఇవ్వడంతో.. వేతనాలు అనూహ్యంగా రూ. 27 వేలకు పెరిగాయి. దీంతో 16 వేలకు పైగా హోంగార్డు కుటుంబాలు నేడు స్వరాష్ట్రంలో సగౌరవంగా జీవిస్తున్నాయి....
Sep 10 2023, 11:18