ఏసీబీ కోర్టుకు చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కు సంబంధించి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టుకు తరలించింది. భారీ భద్రత మధ్య వాదోపవాదనలు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు నాయుడు ఆనాడు సీఎం హోదాను అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. మొత్తం కీలకమైన వ్యాఖ్యలు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పలు సెక్షన్ల కింద చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేశారు.
చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ కు, తనయుడు నారా లోకేష్ కు కిలారి రాజేష్ కు ముడుపులు ముట్టాయని పేర్కొంది, ఏపీ సీఐడీ. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు తరపున ఇద్దరు అడ్వొకేట్లు వాదిస్తున్నారు.
ప్రధానంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూత్రా 409వ సెక్షన్ కింద ఎలా నమోదు చేస్తారంటూ తన వాదనలు వినిపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేయడం సబబు కాదని పేర్కొన్నారు.
కనీసం సాక్ష్యం లేకుండా ఏపీ సీఐడీ కావాలని చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసిందని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఏపీ సీఐడీ తరపు లాయర్లు. పక్కా ఆధారాలతోనే తాము కేసు నమోదు చేశామని, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని పేర్కొన్నారు...
Sep 10 2023, 11:17