సర్వ శిక్షకుల పోరు బాట
మహబూబాద్ ,
విద్యాశాఖ సమగ్ర శిక్ష )(ఎస్ ఎస్) లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఈ సందర్భంగా విద్య శాఖలో పనిచేస్తున్న నెలకి 19500 వేలు ఇవ్వడం చాలా బాధాకరమని నిరసన కార్యక్రమం చెప్పట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఎస్ ఎస్ లు చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థలు రద్దుచేసి సమగ్ర శిక్షకులు ఎస్ ఎస్ లను రెగ్యులరైజ్ చేస్తామని నాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎస్ ఎస్ లకు 30,500 వేతనం చెల్లిస్తుండగా మన తెలంగాణలో మాత్రం 20వేల లోపే వేతనం ఇవ్వడం జరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాలను విద్యారంగం బలోపేతం కోసం ఎస్ ఎస్ లు చేస్తున్న కృషి అమోఘం కనుక ఎస్ ఎస్ లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస పే స్కేల్ అమలు చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, ఝాన్సీ, యమునా, ఉష,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Sep 07 2023, 17:50