/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయం Yadagiri Goud
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయం

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తోనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

బిఆర్ఎస్వీ నేత కత్తుల వంశీ

వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరుపున అభ్యర్ధి అయినా ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయం అని బిఆర్ఎస్వీ నేత కత్తుల వంశీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సారి జరిగే ఎన్నికల్లో భూపాల్ రెడ్డి కి 50000 మెజార్టీ ఖాయం అని అన్నారు. ఈ సారి కూడా వెంకట్ రెడ్డి కి ఓటమి తప్పదని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలకు ఓటమి తప్పదని, ఓటమి భయంతోనే వెంకట్ రెడ్డి కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు అని,

నల్లగొండ నియోజక వర్గం అభివృద్ధి ని చూసి వెంకట్ మాట్లాడాలని అన్నారు. దమ్ముంటే నియోజక వర్గ అభివృద్ధి కి తాను సిద్దమా అని అన్నారు.

నియోజక వర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా భూపాల్ రెడ్డి గెలుపు కోరుకుంటున్నారు అని పేర్కోన్నారు రాష్ర్టంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం పగటి కల అని, రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సిఎం కావడం ఖాయం అని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చాలా అవసరం అని పేర్కొన్నారు.

బహుజనులంతా ఏకంకండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం జరుగుతోందని తెలంగాణ బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు.

బుధవారం నాడు నర్సంపేటకు చెందిన మదన్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహుజన సమాజ్ వాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

బహుజన సమాజ్ వాదీ పార్టీ మరో విజయం సాధించింది. దొరల పార్టీ నుంచి, దొరల జెండా మోస్తూ చాకిరి చేసిన బహుజనుడు బహుజనుల పార్టీకి రావడం సంతోషం. ఒక శాతం ఉన్న అగ్రవర్ణాల అధికారాన్ని చేపడుతుంటే..90శాతం ఉన్న బహుజనులు ఏం చేయాలని ప్రశ్నించారు. బీసీ వర్గాల నుంచి 150కులాలు ఉంటే 6కులాలకే టికెట్లు ఇచ్చి..23సీట్లు మాత్రమే సీఎం కేసీఆర్‌ ఇచ్చారు. బహుజనులు మన బతుకుల బాగుకోసం మనం ఆలోచించాలి.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్లీ దొరల పాలన వల్ల బహుజనులు నష్టపోతున్నాం. 99శాతం ఉన్న మన కోసం మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది.. మనం అందరం ఒక తాటిపైకి రావాలి. వంద కోట్ల లిక్కర్ స్కామ్‌లో నిందితురాలు అయిన ఎమ్మెల్సీ కవిత ను ముట్టుకోవడానికి భయపడుతున్నారు.

అదే బహుజన గిరిజన బంజారా లక్ష్మీ భాయ్‌ ను చిత్రహింసలకు గురిచేస్తే ఎవరు మాట్లాడరు.డాక్టర్ తాటికొండ రాజయ్య కు టికెట్ రాకపోతే అంబేడ్కర్ విగ్రహం వద్ద వలవల ఎడుస్తున్నారు.. ఆయనకు అంబేడ్కర్ ఏం చెప్పిండో తెలియదా? అంబెడ్కర్.. ఆత్మ గౌరవంతో బోధించు, సమీకరించు, ఆశించు అని జీవించమన్నారు.

రాజయ్య.. మీరు అలా ఏడవద్దు. ఎలక్షన్ ఓట్ల కోసమే రైతు రుణ మాఫీ, లాంటి బిస్కెట్లు వేసి కేసీఆర్ ఆకట్టుకుంటున్నారూ. అది నమ్మకండి’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు....

నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న తండు సైదులు గౌడ్

రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా నల్గొండ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు Ex జెడ్పిటిసి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా.తండు సైదులు గౌడ్ గారు బుధవారం రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్స్ స్కీనింగ్ కమిటీకి ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఒకసారి జెడ్పిటిసిగా మరియు అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నటువంటి నాకు నేనొక బీసీ గౌడ బిడ్డగా ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కోరుతున్నాను

Flights: రెండు విమానాలు.. ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి రావడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులు అప్రమత్తమయ్యారు..

రెండూ.. విస్తారా విమానయాన సంస్థకు (Vistara Airlines) చెందిన విమానాలే కావడం గమనార్హం. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

బుధవారం ఉదయం దిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే725 విమానం టేకాఫ్‌ అయ్యేందుకు దిల్లీ విమనాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వస్తున్న విస్తారా విమానానికి ఏటీసీ అనుమతి లభించడంతో పక్కనే ఉన్న మరో రన్‌వేపై ల్యాండ్‌ అయింది.

ఈ క్రమంలో ల్యాండ్‌ అయిన విమానం.. దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం ఉన్న రన్‌వేపైకి వస్తుండటాన్ని మహిళా పైలట్‌ గుర్తించి ఏటీసీని అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్‌ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు.

దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కి.మీలే. సాధారణంగా విమానం టేకాఫ్‌ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలను అనుమతించరు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్‌ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు..

Daggubati Purandeswari : నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారు..

విశాఖలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. ఏపీ బీజీపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ పదాధికారుల సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆందోళన కరంగా వుందిని ఆమె అన్నారు. నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మరణాలను హత్యలుగానే చేస్తున్నట్లుగానే భావించాలన్నారు పురంధేశ్వరి..

అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని, వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు పురంధేశ్వరి. ఎప్పుడు మీడియాకి దూరంగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితి అని ఆమె వ్యాఖ్యానించారు.

గ్రామపంచాయతీలు నిధులను దారి తప్పించారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లుకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ ను నియమించారని ఆమె ధ్వజమెత్తారు. మతమార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల భక్తులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత టీటీడీ ఉందని ఆయన అన్నారు. కొండలు నరికేస్తే జంతువులు బయటకే వస్తాయని, ఎర్రచందనం బయటికి తరలించేస్తన్నారన్నారు పురంధేశ్వరి..

ఇస్రో గొప్పతనాన్ని తిలకించడానికి సిద్ధంకండి.. చంద్రయాన్ 3పై పురందేశ్వరి వాక్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్‌కు అంతా సిద్ధమైంది.

ఈరోజు సాయంత్రం కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇందుకోసం యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌ 3లో కీలక ఘట్టంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా స్పందించారు. చరిత్రను తిలకించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రయాన్ 3 నిర్దేశించిన చంద్ర భూభాగాన్ని తాకేందుకు సిద్ధమవుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. చంద్రయాన్ విజయం కోసం ప్రార్థనలో 1.4 బిలియన్ల హృదయాలను కలుపుతోందన్నారు.

ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చరిత్రను తిలకించడానికి ట్యూన్ చేస్తూనే ఉండాలని తెలిపారు. ఇస్రో గొప్ప తనాన్ని, వారి శ్రమ, కృషిని మెచ్చుకోవాలని ప్రజలను పురందేశ్వరి కోరారు.

కాగా.. చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లూ చేసింది.

ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది.

ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి...

చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువగా ల్యాండింగ్!!

చంద్రుడిపై మన వ్యోమనౌక అడుగు పెట్టే చారిత్రక క్షణాల కోసం భారతీయులంతా వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.

చంద్రుడిపై పరిశోధనలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్య సాధనలో తుది అంకానికి చేరుకున్నది.

బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ జాబిల్లికి మరింత చేరువలోకి వెళ్లింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే చివరి 17 నిమిషాలు అత్యంత కీలకం అని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పుడు ల్యాండింగ్ మాడ్యూల్ కదలికలను ఇస్రో శాస్త్రవేత్తలు అనుక్షణం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో ల్యాండింగ్ కావడానికి సూర్యోదయం కోసం వేచి చూస్తున్నామని ఇస్రో పేర్కొంది.

సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపడతారు. బుధవారం సాయంత్రం దాదాపు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు.

ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ లాండింగ్‌లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.. 17 నిమిషాల టెర్రర్ అని ఇస్రో అధికారులు, నిపుణులు చెప్పారు.

పూర్తిగా స్వతంత్రమైన ఈ ప్రక్రియలో సరైన ఎత్తు, సరైన టైంలో సరిపడా ఇంధనం ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. అటుపై తన వేగాన్ని తగ్గించుకుంటుంది. అటుపై సురక్షిత ల్యాండింగ్ కావడానికి సరైన ప్రదేశాన్ని స్వయంగా ల్యాండర్ స్కానింగ్ చేసుకుంటుంది.....

నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత,సీఎం కేసీఆర్ తొలి సారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.

బుధవారం మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం. జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాక కోసం అధికారులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

మెదక్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ఔరంగాబాద్‌లో 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.70 కోట్ల వ్యయంతో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. 2018లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో 35 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే జిల్లా స్థాయి అధికారుల కోసం ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో.. 10 ఎకరాల గ్రీనరీని.. కలెక్టరేట్‌కు రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు.

ఇక జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని 63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీపీలు, పీఆర్వోలకు ప్రత్యేక గదులు నిర్మించారు. స్టోర్స్ ఇంచార్జి, ఔట్ వార్డు, పాస్‌పోర్ట్ విచారణ, ఐటీసీ విభాగాలు, రిసెప్షన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హాల్ నిర్మించారు. కార్యాలయం పక్కనే ఎస్పీ రెసిడెన్స్, పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను కూడా నిర్మించారు.

ఇక నూతన కలెక్టరేట్ భవనానికి సమీపంలోనే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని రూ.60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి బీఆర్ఎస్ భవన్‌ నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయ్యింది.

అయితే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పూర్తి కావడంతో వాటితో పాటే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

మెదక్‌లో ప్రారంభోత్సవాలు పూర్తి అయిన వెంటనే మెదక్ చర్చి కాంపౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.....

ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సిఅర్ రావు కన్నుమూత

భారత్‌కు చెందిన అమెరికా గణాంక శాస్త్రవేత్త కల్యంపుడి రాధాకృష్ణ రావు అమెరికాలోని అయన నివాసంలో. నేటి బుధవారం ఉదయం. కన్నుమూశారు.

ఆయన వయసు102 ఏళ్లు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా ఆయనకు గుర్తింపు ఉన్నది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా కీర్తించబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయన గెలుచుకున్నారు. ఈ ఏడాదే ఆయనకు ఆ అవార్డును ప్రదానం చేశారు. ఆధునిక గణాంక శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా గుర్తిస్తారు. మల్టీవేరియేట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి లాంటి అంశాల్లో ఆయన పనిచేశారు

కర్నాటకలోని హడగలిలో ఓ తెలుగు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖల్లో ఆయన స్కూల్ విద్యాభ్యాసం కొనసాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆయన ఎంస్సీ మ్యాథమెటిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు.

1943లో కల్‌కత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. గణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయన బ్రిటన్ వెళ్లారు. సర్ రోనాల్డ్ ఏ వద్ద ఆయన పీహెచ్‌డీ చేశారు. 1965లో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు.

తొలుత ఆయన ఇండియన్ స్టాటిస్‌టికల్ ఇన్స్‌టిట్యూట్‌, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశారు

భారత్‌కు వచ్చిన ఆయన ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్‌టిక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక కీలక పదవుల్లో ఆయన చేశారు. ఇండియన్ స్టాటిస్‌టికల్ ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.

1968లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేసింది. 2002లో జార్జ్ బుష్ నుంచి ఆయన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు.

స్టాటిస్‌టిక్ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రామెర్‌-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌లను ఆయన డెవలప్ చేశారు..

అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా*

అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్‌ వివేక్‌ తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన రంగా ధర్మాగౌడ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి అకడ డ్రై వర్‌గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు నరేశ్‌గౌడ్‌ డిగ్రీ చదువుతూ ఇంటి సమీపంలోని యువతిని ప్రేమించి పెండ్లి చే సుకున్నాడు.

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు నరేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పట్టణ ఎస్సై ధర్మాగౌడ్‌ను పిలిచి నరేశ్‌కు అనుకూలంగా చార్జి షీట్‌ వేస్తానని దానికి రూ.6 వేలు లంచం డిమాం డ్‌ చేశాడు.

2006 మే 4న ధర్మాగౌడ్‌ వద్ద ఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు....