/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సిఅర్ రావు కన్నుమూత Yadagiri Goud
ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సిఅర్ రావు కన్నుమూత

భారత్‌కు చెందిన అమెరికా గణాంక శాస్త్రవేత్త కల్యంపుడి రాధాకృష్ణ రావు అమెరికాలోని అయన నివాసంలో. నేటి బుధవారం ఉదయం. కన్నుమూశారు.

ఆయన వయసు102 ఏళ్లు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా ఆయనకు గుర్తింపు ఉన్నది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా కీర్తించబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయన గెలుచుకున్నారు. ఈ ఏడాదే ఆయనకు ఆ అవార్డును ప్రదానం చేశారు. ఆధునిక గణాంక శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా గుర్తిస్తారు. మల్టీవేరియేట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి లాంటి అంశాల్లో ఆయన పనిచేశారు

కర్నాటకలోని హడగలిలో ఓ తెలుగు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖల్లో ఆయన స్కూల్ విద్యాభ్యాసం కొనసాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆయన ఎంస్సీ మ్యాథమెటిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు.

1943లో కల్‌కత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. గణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయన బ్రిటన్ వెళ్లారు. సర్ రోనాల్డ్ ఏ వద్ద ఆయన పీహెచ్‌డీ చేశారు. 1965లో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు.

తొలుత ఆయన ఇండియన్ స్టాటిస్‌టికల్ ఇన్స్‌టిట్యూట్‌, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశారు

భారత్‌కు వచ్చిన ఆయన ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్‌టిక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేక కీలక పదవుల్లో ఆయన చేశారు. ఇండియన్ స్టాటిస్‌టికల్ ఇన్స్‌టిట్యూట్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.

1968లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేసింది. 2002లో జార్జ్ బుష్ నుంచి ఆయన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు.

స్టాటిస్‌టిక్ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రామెర్‌-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌లను ఆయన డెవలప్ చేశారు..

అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా*

అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్‌ వివేక్‌ తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన రంగా ధర్మాగౌడ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి అకడ డ్రై వర్‌గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు నరేశ్‌గౌడ్‌ డిగ్రీ చదువుతూ ఇంటి సమీపంలోని యువతిని ప్రేమించి పెండ్లి చే సుకున్నాడు.

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు నరేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పట్టణ ఎస్సై ధర్మాగౌడ్‌ను పిలిచి నరేశ్‌కు అనుకూలంగా చార్జి షీట్‌ వేస్తానని దానికి రూ.6 వేలు లంచం డిమాం డ్‌ చేశాడు.

2006 మే 4న ధర్మాగౌడ్‌ వద్ద ఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు....

తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న మంగళవారం శ్రీవారిని 72,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 27,060 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

రేపు తెలంగాణలో సా "6.30 వరకు స్కూల్స్ ఓపెన్

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది.

ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

ఈ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత ఘట్టాన్ని విద్యార్థులు నేరుగా చూడాలనే ఆలోచనతో రేపు స్కూళ్లను 6.30 వరకు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అద్భుత ఘట్టాన్ని స్టూడెంట్స్ వీక్షించేందుకు స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

దీంతో రేపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు 6.30 వరకు నడవనున్నాయి.

కాగా, జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో జూలై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ నుండి ప్రతిష్టాత్మంగా చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వివిధ దశల అనంతరం.. రేపు సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

జాబిల్లిపై చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత ఘట్టం కోసం యావత్ ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.....

Arvind: కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోంది: అర్వింద్‌..

నిజామాబాద్‌: గజ్వేల్‌లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ (CM KCR) కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ఆరోపించారు..

నిజామాబాద్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు. మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని, భాజపాకి వాళ్ల ఓటింగ్‌ కూడా పెరుగుతుందని అన్నారు.

భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు. ముస్లింలను కేసీఆర్‌ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.

అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

నార్మల్‌గా ఈసారి ఎన్నికల బరిలోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టం. అందుకే ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను ఏ, బి, సి అనే మూడు కేటగిరీలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో ఇప్పటి వరకూ గెలిచిన స్థానాలు, రెండో కేటగిరీలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన స్థానాలు, మూడో కేటగిరిలో ఇప్పటివరకూ గెలవని స్థానాలను ఉంచబోతున్నారు.

గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని.. ఈ స్థానాల్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల పర్యటనలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీని అధిష్టానం అడిగినట్లు సమాచారం. అది అందిన వెంటనే బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.........

మూడ్రోజులకే ఎమ్మెల్యే టికెట్ !

- భద్రచాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం

- పార్టీలో చేరిన మూడ్రోజులకే టికెట్

- ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం

అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మెుత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులతో జంబో లిస్ట్ విడుదల చేశారు. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన వివిధ సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వైరా, ఇల్లందు ఇద్దరు అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరిగినా.. ఇల్లెందులో బానోత్‌ హరిప్రియ నాయక్‌కు మరోసారి అవకాశం కల్పించారు. వైరాలో మాత్రం రాములు నాయక్‌కు మెుండిచెయ్యి చూపించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మె్ల్యే మదన్ లాల్‌కు అవకాశం కల్పించారు.భద్రాచలం నియోజవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావుకు పార్టీలో చేరిన మూడ్రోజుల్లోనే టికెట్ సాధించారు.

మాజీ ఎంపీ పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావు.. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి రాహుల్‌ గాంధీ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల రోజుల్లోనే మళ్లీ సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావును భద్రాచలం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వైఎస్సాఆర్‌సీపీలో పనిచేశారు.

పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందగా.. తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పొంగులేటితో కలిసి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు .2018 ఎన్నికల్లో భద్రాచలం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత కూడా ఆయన భద్రాచలం బీ‌ఆర్‌ఎస్ ఇంఛార్జ్‌గా కొనసాగారు. అయితే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించి పార్టీకి దూరమవ్వగా... తెల్లంగా కూడా గూలాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే ఈనెల 17న మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన దాదాపు మూడ్రోజులకే ఆయన బీఆర్ఎస్ పార్టీ తిరిగి టికెట్ ఇచ్చింది.

ఈ నెల 28న ఢిల్లీకి చంద్ర‌బాబు :ఈసికి ఫిర్యాదు చేయ‌నున్న‌టిడిపి అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

ఓట్ల తొలగింపులో ఉరవకొండ తరహా ఘటనలు ఉన్నాయని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ సానుభూతిపరులకు సంబంధించిన దొంగ ఓట్లను చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లను తొలగించడం తదితర అంశాలను ప్ర‌స్తావించ‌నున్నారు..

వాలంటీర్లతో టీడీపీ, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని.. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి చంద్రబాబు తెలియజేయనున్నారు.

ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ, విశాఖ తదితర ఘటలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేయనున్నారు.

ఉర‌వ‌కొండ అవ‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డ ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని ఈసికి తెలుప‌నున్నారు

చంద్ర‌బాబు.. ఇదే సమయంలో టీడీపీ నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. అక్రమాలు నివారించాలని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు...

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఎక్కడ:కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉంది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.

చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని,దీనిపై yకేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

మహిళా హక్కులపై ఆయన ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బీజేపీ నుంచి ఎవరోఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ధ్రువీకరించారని పేర్కొన్నారు...

ఘరానా మోసం: హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా..

హైదరాబద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు..

బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు.

హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు.

ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు..

SB NEWS