Flight: గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్.. మంటలతో విమానం ల్యాండింగ్..!
డల్లాస్: విమానం(Plane) గగనతలంలో ఉండగా అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఆకస్మికంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో.. విమానాన్ని టేకాఫ్ చేసిన వెంటనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది..
దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్( Southwest Airlines)కు చెందిన బోయింగ్ విమానం టెక్సాస్‌లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.
అది మెక్సికో(Mexico)లోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. కానీ టేకాఫ్ అయిన వెంటనే ఒక ఇంజిన్ నిప్పులు చిమ్మింది. దాంతో వెనకవైపు మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 30 నిమిషాల వ్యవధిలో టేకాఫ్ అయిన చోటే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు( Plane makes emergency).
'మాకు ఏదో పేలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఇంధనం వాసన వచ్చింది' అని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. మెకానికల్ సమస్య రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమానయాన సంస్థ తెలిసింది. ప్రయాణికులందరినీ వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపించామని తెలిపింది..
Aug 19 2023, 09:11