/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz YS Sharmila: వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన.. Yadagiri Goud
YS Sharmila: వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన..

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లాలనుకున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు..

దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్న షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఆమె నివాసం లోటస్‌పాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. గజ్వేల్‌ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగగా.. అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు..

దేనికోసం అనుమతి తీసుకోవాలి?

పోలీసులు గృహనిర్బంధం చేయడంపై షర్మిల వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులకు హారతి ఇచ్చారు. డ్యూటీ సరిగా చేయండి సార్‌ అని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న భారాస నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు.

''పోలీసులు సీఎం కేసీఆర్‌ తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలి మమ్మల్ని పట్టుకుంటున్నారు. దేనికోసం అనుమతి తీసుకోవాలి? ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? కేసీఆర్‌ నన్ను చూసి భయపడుతున్నారు'' అని షర్మిల అన్నారు.

ఇంటి వద్దే దీక్షకు దిగిన షర్మిల

గజ్వేల్ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె చెప్పారు.

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం

సికింద్రాబాద్‌ అల్వాల్‌లోని వెంకటపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు వ్యభిచార ముఠా గట్టురట్టు చేశారు.

వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది యువతులు, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తు్న్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

SB NEWS

హ్యాట్రిక్ కోసం కేసిఆర్ సర్కార్ ఫోకస్ !

- ఆగస్ట్ 21న అభ్యర్థుల ఎంపికపై జాబితా విడుదల

- నేతల్లో కొనసాగుతున్న టెన్షన్

- సిట్టింగులగే టికెట్ల కేటాయింపుకు మొగ్గు

- ప్రజల్లో ఉండాలని నేతలకు కేసిఆర్ పిలుపు

తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలు సిద్దం అవుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 21న దాదాపు 60 మందితో లిస్టు విడుదలకు రంగం సిద్దమైంది. అందులో ఇప్పుడు సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, లిస్టులో ఉండేదెవరు.. మారేదెవరనేది ఆసక్తి కరంగా మారింది. కొందరు మంత్రులను లోక్ సభకు పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి జాబితాపై కసరత్తు:

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్‌ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న 60 మందికి పైగా పేర్లతో లిస్టు ప్రకటించన్నారు. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగింది. సిట్టింగ్ లకు తిరిగి సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేసినట్లు సమాచారం.

పూర్తైన గ్రౌండ్ సర్వే;

సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. 20 మందికిపైన సిట్టింగ్ లకు టికెట్ దక్కదని తెలుస్తోంది. వారికి ఇప్పటికే బుజ్జగింపులు మొదలయ్యాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం.

సిట్టింగులకు టికెట్ల కేటాయింపు డౌటే ?

దక్కేదెవరు..మారేదెవరు.. ఇదే సమయంలో టికెట్ దక్కదనే సంకేతాలు అందుకున్న ఎమ్మెల్యేలు కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

2018లో ఏడుగురు సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మళ్లీ టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !

- కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ

- నేతల మధ్య వాగ్వాదం

వైఎస్ఆర్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ గజ్వేల్ పర్యటనకు వెళ్తానని షర్మిల ప్రకటించారు. దరిమిలా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల విషయమై తనకు స్థానికుల నుండి ఆహ్వానం రావడంతో గజ్వేల్ టూర్ కు వెళ్లనున్నట్టుగా వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న ప్రకటించారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామస్తులు షర్మిలకు ఈ మేరకు వినతి పత్రం పంపారు. దీంతో తీగుల్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే షర్మిల గజ్వేల్ టూర్ నేపథ్యంలో పోలీసలు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే షర్మిల గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకుంటామని స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తీగుల్ గ్రామంలో దళితబంధు పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని స్థానికుల నుండి వినతి మేరకు తాను తీగుల్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని షర్మిల పోలీసులకు సమాచారం పంపారు.

తన టూర్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటారని వార్నింగ్ ఇవ్వడంతో షర్మిల పోలీసులకు సమాచారం పంపారు. తన టూర్ కు భద్రత కల్పించాలని కోరారు.

వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు భావించారు. దీంతో హైద్రాబాద్ లోటస్ పాండ్ లోనే ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.

బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

నందిహిల్స్‌ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మీపై ఎల్బీనగర్‌ పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన ఘటనపై గురువారం సాయంత్రం మంత్రి స్పందించారు.

విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ సీపీకి ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు.

మహిళపై దాడికి పాల్పడ్డ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదేశించారు.

సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు...

కారెక్కెందుకు జగ్గారెడ్డి : సిద్ధమా ❓️

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక వైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు ఉంటున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా, మరో వైపు సొంత పార్టీ నుంచి మరి కొందరు సీనియర్‌ నాయకులు జంప్‌ చేస్తున్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.

జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది.

అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ గురువారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు....

నేడు సిరిసిల్ల లో కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్‌రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం జిల్లా ఏరియా దవాఖానకు చేరుకుని 40కేవీ రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్‌, క్యాన్సర్‌ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

సర్వాంగ సుందరంగా పాపన్న జంక్షన్‌

సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్‌రోడ్డులో నర్సింగ్‌ కళాశాల ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశారు.

దీని కోసం మున్సిపల్‌ శాఖ రూ.30 లక్షల నిధులు వెచ్చించించింది. పాపన్న పేరిట అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ జంక్షన్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేయనున్నారు. విగ్రహం చుట్టూ గార్డెన్‌, పౌంటేన్‌లతో సందర్శకులను ఆకట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు...

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 18

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నేడు స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం స్వామివారిని 64,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.6 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీవారికి 24,473 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పద్మావతి అమ్మవారి ఆలయంలో నేడు వరలక్ష్మి వర్రతం ఈ నెల 25న తిరుచానూరులో వైభవంగా జరగనుంది. భక్తులు నేరుగా కానీ వర్చువల్‌గా కానీ పాల్గొనే అవకాశం ఉంది.......

Hyderabad: ఉక్కు వంతెనకు కార్మిక నేత పేరు.. ప్రారంభ తేదీ ఖరారు.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్‌ సమీపంలోని వీఎస్టీ కూడలి వరకు నిర్మించిన ఉక్కు వంతెన(Steel Bridge) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది..

ఆగస్టు 19న (శనివారం) ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్‌ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించిందని తెలిపారు.

ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు.

నాయిని.. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని.. అలాగే, చాలా కాలం పాటు వీఎస్‌టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు..

మంత్రి రజిని అవినీతికి లెక్కేలేదు : మంత్రి పుల్లారావు

ధనార్జనే ధ్యేయంగా ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి రజని పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని అన్నారు.

మంత్రి ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటు-లో ఉండట్లేదన్నారు. మంత్రి అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందన్నారు.

వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీల వరకు అవినీతే జరుగుతోందని, భూవివాదం ఉన్నచోట తలదూర్చి సెటిల్‌మెంట్లు- చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కుటుంబీకులను ముందుపెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారని, చిలకలూరిపేట మున్సిపాలిటీ-ని అవినీతికి అడ్డాగా మార్చారన్నారు.

పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, ప్రజాధనాన్ని మంత్రి రజని సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.

మున్సిపల్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.