Nara Lokesh: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలి: లోకేశ్
మంగళగిరి: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరిలోని డాన్ బోస్కో స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, యువతతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. తెదేపా హయాంలో యువతకు 6 లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చాం.
కానీ, ఇప్పటి సీఎం గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఫాక్స్ కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారు..
మనం గొప్పగా చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కామెడీగా మారింది. యువత సమస్యలు పరిష్కరించేందుకే యువగళం చేపట్టా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు. పోరాటానికి భయమెందుకు.. తగ్గేదే లేదు. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా.. రూ.50వేల జీతం తీసుకుంటారా? 3 రాజధానులు కావాలా? అమరావతి రాజధాని కావాలా?మీరే తేల్చుకోవాలి.
తెదేపా అధికారంలోకి వచ్చాక 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాష్ట్రంలో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీని ప్రక్షాలన చేసి.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యాప్రణాళికలో మార్పులు తెస్తాం. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాం'' అని లోకేశ్ వెల్లడించారు..
Aug 16 2023, 20:45