Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద.. కాపాడుకోవాలి: పవన్
విశాఖ: భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
''ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద. వాటిని రక్షించుకునే అవగాహన మనకు లేదు.
దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలే మిగిలాయి. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తాం.
జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.
దీనిపై వైకాపా ప్రభుత్వం స్పందించకపోతే.. ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తాం. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి'' అని పవన్ కల్యాణ్ అన్నారు..
SB NEWS
SB NEWS
Aug 16 2023, 20:44