/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణకు అమిత్‌ షా ఖరారైన షెడ్యూల్‌ Yadagiri Goud
తెలంగాణకు అమిత్‌ షా ఖరారైన షెడ్యూల్‌

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ… ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటించేలా ప్లాన్‌ చేసింది. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.

ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అదే రోజున ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.

ఇప్పటికే అమిత్‌ షా పర్యటన రాష్ట్రంలో రెండు సార్లు వాయిదా పడింది. బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా ఒకసారి, మణిపూర్‌ అల్లర్లు, వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మరోసారి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయింది.

అసెంబ్లి ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తెలంగాణలో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర నేతలు అమిత్‌షాకు పదే పదే విన్నవించారు. అసెంబ్లి ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయమే ఉండడంతో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది...

వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

హైదరాబాద్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో నేడు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు అవినాష్ రెడ్డి..

గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు..వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంది.

అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై చార్జిషీట్ వేసిన సీబీఐ. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది.

వివేకా హత్య కేసులో 145 పేజీల తో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఇక జూన్ 19 తేదీన సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాష్ రెడ్డి. దర్యాప్తు ను పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు.

గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి.. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ సీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లెక్కలో పేర్కొన్న అవినాష్ రెడ్డి. వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని లేఖ లో పేర్కొన్నారు. ఇక ఈ లేఖ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీబీఐ..

Hyderabad Express: హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..

ఉలవపాడు: నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడ్డారు..

ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు.

అనంతరం దొంగలు రైలులోని ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద ఉన్న సుమారు 30 తులాల బంగారాన్ని చోరీ చేశారు.

అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి చోరీకి పాల్పడబోతుండగా.. రైలులోని పోలీసలు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు..

భారత్ పై వెస్టిండీస్ విజయం

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అమెరికా వేదికగా జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అందులో సూర్య 61, తిలక్ 27, మినహా ఎవరూ సరిగా రాణించలేదు. అలాగే మంచి దూకుడు లో ఉన్న సూర్యకు వర్షం పలుమార్లు బ్రేకులు వేసింది.

కాగా 166 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించారు. దీంతో ఐదు టీ20 ల సిరీస్ 3-2 తేడాతో టైటిల్ ను కైవసం చేసుకున్నారు.

కాగా ఈ సిరీస్ ఓటమితో భారత్ 17 ఏళ్ల తర్వాత విండీస్ జట్టుపై తొలి సిరీస్ ను కోల్పోయింది.

జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

శంషాబాద్:ఆగస్టు 14

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా జింక, దుప్పి మాంసం విక్రయిస్తూ ఎస్ఓటి పోలీసులకు పట్టుపట్ట ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో చోటుచేసుకుంది.

ఎస్ఓటి ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా గగన్ పహాడ్‌లో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

జింక,దుప్పి మాంసం విక్రయిస్తున్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిపురం గ్రామానికి చెందిన వెంకటేష్, కందుకూరు మండలం లేమూరు చెందిన

కరుణాకర్‌తో పాటు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఏరుగుపల్లి గ్రామానికి చెందిన శ్రీను లను అదుపులో తీసుకున్నారు.

వారి వద్ద నుండి 16 కేజీల జింక, దుప్పి మాంసం స్వాధీనం చేసుకొని ఒక (TS 05 FN 8258) యాక్టివా, ఒక (AP 29 BL 1407) హోండా షైన్ బైక్ ను సీజ్ చేసి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఆర్జీఐఏ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు...

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో మంగళవారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాపు ఇచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు మూసివేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు అందజేయనున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నారు.

ఏ గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాలి. బీ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసు కొని ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దరంలో ఉన్న ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. డీ ఎరుపు పాసులున్న వారికి ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇకఈ నలుపు పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. షేక్పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగింది....

బోను లో చిక్కిన చిరుత

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు.

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు.

రెండు రోజుల క్రితం నరశింహస్వామి ఆలయ సమపంలో బాలికపై చిరుత దాడి చేసింది. చిరుత సంచరించే ప్రాంతాలను గుర్తించి అటవీ అధికారులు నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు చిరుత చిక్కిన ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

కాగా.. తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత సంచారం తాజాగా కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న వాహనదారులకు 38వ మలుపు వద్ద చిరుత కనపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకున్న తర్వాత నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..

తిరుపతి :ఆగస్టు 14

తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ సోమవారం కూడా కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక ఆదివారం శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

37738 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్..

ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రజినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జైలర్ గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం ముందే మూడురోజుల్లో రూ. 200 కోట్లు రాబట్టి రజినీ ర్యాంపేజ్ ను చూపించింది. ఇక ఈ చిత్రం రజినీ ఎలివేషన్స్.. మోహన్ లాల్, శివన్న లా క్యామియో.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. బీస్ట్ సినిమా పరాజయం తరువాత నెల్సన్ తో సినిమా వద్దని రజినీకి చాలామంది చెప్పినా ఆయన కథను నమ్మి ఈ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు..

ఇక తాజాగా రజినీ బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో ప్రత్యేక్షమయ్యాడు. మొట్ట మొదటిసారి రజినీ, జైలర్ రిజల్ట్ పై స్పందించాడు. ” సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడికి నేను కూడా లోనయ్యాను. ఒకనొక సందర్భంలో ఈ సినిమా హిట్ అవుతుందా అనే అనుమానం కూడా వచ్చింది. అప్పుడు స్వామిజీ ఒక మాట చెప్పారు.. కంగారు పడకు.. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఆయనే స్వయంగా చెప్పిన తరువాత ఇక జైలర్ రిజల్ట్ గురించి ఆలోచించడం ఎందుకు అనుకున్నా.. ఇక జైలర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..

గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది.

ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసిన విషయం తేలిసిందే.

కాగా.. కొన్ని రోజుల నుంచి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న నిరసనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొచ్చారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను మీడియా తెలంగాణ సర్కారు దృష్టికి తీసుకొచ్చింది.

మరోవైపు ప్రతిపక్షాలు సైతం అభ్యర్ధుల ఆందోళనకు మద్దతు ఇస్తూ పరీక్ష వాయిదా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రూప్-2 అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.....