మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల...
పట్టణంలోని 13&14 వార్డులో మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నుండి బొడ్రాయి వరకు రూ. 60 లక్షల రూపాయల వ్యయంతో డబల్ సి.సి.రోడ్ల పనులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మర్రిగూడ లో డబల్ సిసి రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరొక్కసారి అత్యధిక మెజారితో గెలిపిస్తే మర్రిగూడ ను ఇంకా మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని ధైర్యంగా ఉండాలన్నారు..
అనంతరం మర్రిగూడ లో సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి నుండి జేరిపోతుల అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో గుమ్ముల శ్రీధర్ రెడ్డి, మోత్కూర్ శంకర్, బొజ్జ గోవర్ధన్, బుర్ర మల్లేష్, బొజ్జ స్వామి, జేరిపోతుల శ్రీధర్, బాలకోటి ప్రేమకుమార్, మహేష్, గణేష్ తదితరులు.. బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..
మరియు
బిజెపి నుండి బీపంగి వినోద్ కుమార్ (చంటి) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వి.మల్లేష్, వి. సైదులు, ప్రశాంత్, రఘు, మహేష్, ప్రశాంత్, శివమణి, బబ్ల్యూ, వినయ్,ప్రేమ్ కుమార్, ప్రభాస్, వంశీ తదితరులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, జేరిపోతుల భాస్కర్ గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, బొజ్జ వెంకన్న, కో ఆప్షన్ మెంబర్ గున్ రెడ్డి రాధిక యుగెందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు, తుమ్మల గోవింద్ రెడ్డి, తుమ్మల శంకర్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, బీపంగి కిరణ్, మధుసూదన్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కడారి యాదయ్య, బొజ్జ యాదయ్య, బీపంగి కిరణ్, సుంకరబోయిన సత్యనారాయణ, సుంకరబోయిన రవి, బొజ్జ నాగయ్య గార్లు మరియు మర్రిగూడ నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..
Aug 13 2023, 19:43