Tirumala: మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలు..
తిరుమల: తిరుమల నడక మార్గంలో చిరుత బాలికపై దాడిచేసి, ప్రాణాలు తీసిన నేపథ్యంలో అటవీ పరిసర గ్రామాలలో అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది..
ఇందులో భాగంగా బాలికపై చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది..
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
వెహికల్ సైరన్ వేసి చిరుతను విజిలెన్స్ సిబ్బంది అడవిలోకి తరిమినట్లు చెప్పారు. కాలినడకన వెళ్లే భక్తులను కట్టుదిట్టమైన భద్రత మధ్య గుంపులుగా పంపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Aug 13 2023, 14:41