మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం: గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం
- రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు మంత్రి జగదీష్ రెడ్డి
- 9,8 వార్డులో కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి
ఒక రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9 మరియు 8 వార్డులో జగదీష్ అన్న కప్2023 కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. 2014లో తాము ప్రజల వద్దకు వస్తే సమస్యలు చెప్పారని నేడు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. 2014లో సూర్యాపేట పట్టనం ఇప్పుడు ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కలను బాగా పెంచి సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచడం అభినందనీయమన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంతటి అభివృద్ధి మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలోనే జరిగిందన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని అన్నారు.
సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజల అదృష్టం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మార్చి పాలన దగ్గర చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, 21 స్మశానవాటికలు మహాప్రస్థానం, మూసి మురికి నీటి నుంచి విముక్తి కల్పించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అభివృద్ధి చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ తో వైద్య సదుపాయానికి, నిరుపేదల విదేశీ విద్యకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి, మచ్చ రాము,బొడ్డు దుర్గయ్య, బండమీది రజిత, రజిని పందిరి సువర్ణ,అనుములపురి వినయ్, నవీన్, మహిళ నాయకురాలు కరుణశ్రీ,అంజమ్మ విజయ,మహేశ్వరి,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Aug 12 2023, 18:56