సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి: పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఒక్కరికి 3 హాస్టల్ల నిర్వహణ ఎలా సాధ్యం ? వార్డెన్లు అంటే పప్పులు ఉప్పు ఇవ్వడానికేనా ? ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.
విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి సంక్షేమ హాస్టల్లో ఎంతో ఉపయోగపడతాయనుకుంటే జిల్లాలో ఒక వార్డెన్ కు మూడు హాస్టల్ నిర్వహణ ఎలా సాధ్యమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రశ్నించారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లు అంటే పప్పులు, ఉప్పులు ఇవ్వడానికేనా అని అన్నారు. నల్లగొండ జిల్లాలో 61sc సంక్షేమ హాస్టల్స్ ఉంటే 23 మంది ఉన్నారని,41 st సంక్షేమ హాస్టల్స్ ఉంటే 28 మంది ఉన్నారని, bc 42 హాస్టల్స్ ఉంటే 24 మంది మాత్రమే వార్డెన్లు మాత్రమే ఉన్నారని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజు చిట్యాల మండలంలోని ఉరుమడ్ల sc సంక్షేమ హాస్టల్లో నిర్వహణ తీరుపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనము అందించాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ లో తల్లిదండ్రులను వదిలేసి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు వార్డెన్లు తప్పక పరిశీలించాలని చదువులో మెరుగైన సూచనలు అందించాలని కోరారు. సరియగు వసతులు కల్పించాలని ఫ్యాన్లు మంచినీరు టాయిలెట్స్ సక్రమంగా ఉంచాల్నారు. విద్యార్థులకు అందవలసిన కాస్మోటిక్ చార్జీలను వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వము పెట్టెలు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు ఈ విద్యా సంవత్సరంలో అందించాలని కోరారు. విద్యార్థులు జబ్బున పడకుండా వైద్యం సక్రమంగా అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సర్వేలు పూర్తయిన తర్వాత కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సర్వే కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, నాయకులు అయితరాజు నరసింహ, బెలిజ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Aug 11 2023, 16:32