సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ* అమ్మవారి బోనాల పండుగని విజయవంతం చేయండి: మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్
మొక్కితే వరాలిచ్చే తల్లి ఊర ముత్యాలమ్మ
- 13న బోనాల పండుగ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
- మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
మొక్కితే వరాలు ఇచ్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారని సూర్యపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం దేవాలయానికి ఆర్చి నిర్మించ డముతో దేవాలయానికి కొత్త కళ వచ్చిందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో సూర్యాపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. వేయి కండ్లతో అందరిని కాపాడే ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో కన్నుల పండుగ జరుపుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో దేవాలయంలోని సమస్యలు పరిష్కారం అయ్యాయనీ అన్నారు. దేవాలయంలో బోనాల పండుగ రోజున భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ ఆవరణ మొత్తం ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని, పండుగ రోజున ప్రత్యేకంగా సిబ్బందిని పెంచి బందోబస్తును ఏర్పాటు చేయాలని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామానుజుల రెడ్డి, పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు సారగండ్ల రాములు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, సారగండ్ల శ్రీనివాస్, సారగాండ్ల కోటేష్, కోలా నాగరాజు, గుంటి సైదులు, వెంకులు, వెంకటేశం, అర్వపల్లి లింగయ్య, కొల లక్ష్మయ్య, ఇండ్ల వెంకటలక్ష్మి, ఎస్. వెంకన్న, మొర జానకిరమూలు, ఎస్. రంగయ్య, బసవయ్య, బైరు వెంకన్న తదితరులు ఉన్నారు.
Aug 10 2023, 17:45