NLG: కస్తూరిబా బాలికల విద్యాలయాలకు చేయుతనిస్తున్న కస్తూరి ఫౌండేషన్
గుర్రంపోడ్: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా కస్తూరి ఫౌండేషన్ వారు తెలుసుకొని సుమారు 3 లక్షల వ్యయంతో సానిటరీ వర్క్స్ మరమ్మత్తులు చేపట్టినారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో పుష్పలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ఘన సన్మానం నిర్వహించారు. శ్రీ చరణ్ మాట్లాడుతూ.. 2017లో కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించినపుడు విద్యారంగాన్ని సేవా రంగంగా ఎంచుకొని 6 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో తమ ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ.. మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులకు సూచించారు. మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారన్నారు.
కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా పాఠశాలోని విద్యార్దినులకు స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్, గ్రామర్ బుక్స్, డిక్షనరీ బుక్స్, మైక్ సెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, మహేష్, పిన్నింటి నరేందర్ రెడ్డి, సమ్మిడి నవీన్ రెడ్డి, వీరమళ్ల కార్తీక్ గౌడ్, రవి, టీచర్లు హేమలత, జ్యోతి, కవిత, ఉమాదేవి, నేహా, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Aug 10 2023, 13:27