ChandraBabu: నన్ను చంపడానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారో తేలాలి: చంద్రబాబు
విజయనగరం: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అంగళ్లు ఘటనలో తనపై హత్యాయత్నం కేసు నమోదు సహా వివిధ అంశాలపై విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు..
దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అంగళ్లులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని.. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను చంపడానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారో ఈ విచారణలో తేలాలన్నారు..
సైకో సీఎం ఆదేశాల ప్రకారమే..
''నాపై హత్యాయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదెక్కడి దుర్మార్గమో నాకు అర్థం కావట్లేదు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. చాలాసార్లు నాపై దాడికి యత్నించారు.
సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే.. నన్ను ప్రజల మధ్య తిరగనీయకుండా చేయడానినే ఈ కేసులు పెడుతున్నారు. దాడికి కుట్ర పన్నితే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు..
తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు
పుంగనూరులో వైకాపా నేతలు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు? పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. వందలాది తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు. ఘటనాస్థలిలో లేని వారిపైనా కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు సైతం అమానుషంగా వ్యవహరించారు. అందుకే అక్రమ కేసులు, దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాను. అసమర్థనాయకుడు సీఎం అయితే.. వ్యవస్థలు ఇలానే ఉంటాయి'' అని చంద్రబాబు మండిపడ్డారు..
Aug 09 2023, 18:47