/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ* అమ్మవారి బోనాల పండుగని విజయవంతం చేయండి: మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ Miryala Kiran Kumar
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ* అమ్మవారి బోనాల పండుగని విజయవంతం చేయండి: మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలిచ్చే తల్లి ఊర ముత్యాలమ్మ

- 13న బోనాల పండుగ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

- మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలు ఇచ్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారని సూర్యపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం దేవాలయానికి ఆర్చి నిర్మించ డముతో దేవాలయానికి కొత్త కళ వచ్చిందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో సూర్యాపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. వేయి కండ్లతో అందరిని కాపాడే ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో కన్నుల పండుగ జరుపుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో దేవాలయంలోని సమస్యలు పరిష్కారం అయ్యాయనీ అన్నారు. దేవాలయంలో బోనాల పండుగ రోజున భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ ఆవరణ మొత్తం ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని, పండుగ రోజున ప్రత్యేకంగా సిబ్బందిని పెంచి బందోబస్తును ఏర్పాటు చేయాలని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామానుజుల రెడ్డి, పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు సారగండ్ల రాములు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, సారగండ్ల శ్రీనివాస్, సారగాండ్ల కోటేష్, కోలా నాగరాజు, గుంటి సైదులు, వెంకులు, వెంకటేశం, అర్వపల్లి లింగయ్య, కొల లక్ష్మయ్య, ఇండ్ల వెంకటలక్ష్మి, ఎస్. వెంకన్న, మొర జానకిరమూలు, ఎస్. రంగయ్య, బసవయ్య, బైరు వెంకన్న తదితరులు ఉన్నారు.

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

తేది:09-08-2023

ప్రెస్ రిలీజ్

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ 

దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

హైదరాబాద్:

" గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రు. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు.

ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం."

- వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు

స్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా క్లాక్ టవర్ అమరవీరుల స్తూపం నందు ప్రజాయుద్ధనౌక గద్దర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనకై తొలి దేశ మలిదశ ఉద్యమంలో అనేక పాటలతో యువ నాయకులని ఉద్యమ బాట పట్టించిన గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తిలిపరు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి కెవిపిస్ కార్యదర్శి పాలడుగు నాగార్జున బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు రంగాపూర్ యాదయ్య షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్,,, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్య దర్శి మరియు మాలమహానాడు జిల్లా అద్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, విద్యావంతుల వేదిక పందుల సైదులు నియోజకవర్గ ఇన్చార్జ్ కుడూతాల నాగరాజ్ తీగల నవీన్ గంటకాంప నరేష్,కట్టెల మహేష్ ,బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు......

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.2018 లో లాగే ఈసారి కూడా మిజోరం, రాజస్థాన్,MP, ఛత్తీస్గఢ్, రాష్ట్రాలతో కలిపి తెలంగాణ ఎన్నికలను జరపనున్నట్లు సమాచారం. అక్టోబర్ 5 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అంటున్నారు... ఈ లెక్కన రాష్ట్రంలో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండు వారాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

రేపు ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ టవర్

రేపు ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ టవర్*

హైదరాబాద్‌:ఆగస్టు 08

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధంచేసింది.

ఇందూరు ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్లు...

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా..

2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది.

71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే

ఐదేండ్లలో 19 లక్షలు పెరిగిన ఓటర్ల సంఖ్య

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి

అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం

మరోసారి ఓటు హక్కు అవకాశం కల్పించిన ఈసీ

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం. ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు. గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోసారి ఓటు నమోదుకు అవకాశం

రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలకు మరో అవకాశం లభించింది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, ఓటును వేరే ప్రాంతానికి మార్చాలనుకొనే వారికి ఈసీ మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చేనేత దినోత్సవం సందర్భంగా మాత్మ గాంధీ కి నూలు పోగు దండ వేసి చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నాయకులు

చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రామగిరి లో మహాత్మా గాంధీ విగ్రహానికి నూలు పోగు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి దుడుకు లక్ష్మీనారాయణ గారు కర్నాటి యాదగిరి నేత రావిరాల వెంకట్ చిట్టిపోలు సురేష్ కర్నాటి మచ్చ గిరి రుద్ర లక్ష్మీనారాయణ సంగిశెట్టి సురేష్ వల కీర్తి శ్రీనివాస్ దుడుకు తిరుపత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు

ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ పార్కులో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చర్లపల్లి లోని చేనేత కార్మికులను,చేనేత కళాకారులను శాలువలతో సత్కరించి వారిని సన్మానించిన బిజెపి నల్లగొండ జిల్లా చేనేత సెల్ కన్వీనర్ మరియు చేనేత పారిశ్రామిక సంఘం వైస్ చైర్మన్ తీరందాసు కనకయ్య గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఆగస్టు 7 వ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం చేనేత కార్మికులకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు మన భారత దేశ చేనేత కార్మికుని పనితనాన్ని ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ గారు, పట్టణ చేనేత సెల్ కన్వీనర్ 

కటికం శ్రీధర్ గారు,గజం పాండు, గారు బద్దం నగేష్ గారు, గంజి యాదగిరి గారు,సంఘెం కొండయ్య గారు రాపోలు సత్తయ్య గారు, రాపోలు యాదగిరి గారు,రాపోలు పరమేశం గారు,నగేష్ గారు తదితులు పాల్గొన్నారు.

నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం    

     *మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ...

నీలగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నందనవనంగా మార్చడమే లక్ష్యమని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు.

ఆదివారం పట్టణంలోని ఐదవ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో పట్టణములో సిసి రోడ్లు, మురుగు కాలువలు వరద కాలువలు అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధి కళాభారతి వంటి వి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్ర ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పున్న గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్ గార్లు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు 

ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినీమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయినప్పటికి తుది వరకు ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు. గద్దర్‌కు భార్య విమల, కొడుకు, కూతురు ఉన్నారు.