No-Confidence Debate: 'అవిశ్వాసం'పై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..
దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియా' లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై చర్చ ప్రారంభం..
12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై డిబేట్ మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు చర్చకు సిద్ధమయ్యాయి.
అటు ప్రధాని మోదీ (Modi) నేతృత్వంలో భాజపా (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అవిశ్వాసంపై ఎలా స్పందించాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష కూటమి 'ఇండియా (India)' నేతలు సమావేశమయ్యారు..
చర్చ రాహుల్‌తో ప్రారంభం..
విపక్ష కూటమి 'ఇండియా' తరఫున చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు గౌరవ్ గొగొయ్, మనీశ్ తివారీ, దీపక్ బైజ్, అధిర్ రంజన్ చౌధరీ, బెన్నీ బెహనాన్, హిబి ఈడెన్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియకోస్ చర్చలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి..
ఇక అధికార పక్షం తరఫున ఐదుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు అవిశ్వాసంపై సమాధానమివ్వనున్నట్లు తెలుస్తోంది. భాజపా తరఫున నిషికాంత్ దూబే చర్చను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 9న అమిత్‌షా సమాధానమివ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ఇచ్చిన ఈ అవిశ్వాస తీర్మానంపై గురువారం వరకూ 3 రోజులపాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఓటింగ్ జరుగుతుంది..
Aug 09 2023, 10:38