నల్లగొండను హరిత నీలగిరిగా మార్చుకుందాం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
హరిత నీలగిరిగా మార్చుకుందాం : చైర్మన్ మందడి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం 17వ వార్డు ఆర్జాల బావి కాలనీ వాసులకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రెండు ముక్కలు నాటి వాటిని సంరక్షించుకోనీ హరిత నీలగిరిగా మార్చుకుందామని అన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దానికోసం ఎన్నో నిధులు కేటాయిస్తుందని అన్నారు . రాబోవు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మొక్కలు నాటడమే శరణ్యం అన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మహేందర్, ఆర్పీ విజయలక్ష్మి, అన్వర్, హనుమంతు, నందు, నాగరాజు, నరేష్, గోపి, కాశయ్య, మహేష్ గార్లు మరియు _బిఆర్ఎస్, ఉమర్, మస్తాన్ గార్లు కార్యకర్తలు పాల్గొన్నారు..
-------------------------------------
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం.
తల్లిపాలు తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేయస్కరమని ఆరోగ్యకరమని మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆయన 17 వ వార్డు ఆర్జాలబావి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై పలువురు వివరించారు. చిన్నారులు పౌష్టికారంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పౌష్టికరమైన ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
Q ఈ కార్యక్రమంలో BLO ఖుర్షిద్ బేగం, సుగుణ, RP విజయలక్ష్మి, సిస్టర్ పూలమ్మ, ఆశ వర్కర్ సరిత గార్లు మరియు గర్భిణులు, మహిళలు పాల్గొన్నారు..
Aug 08 2023, 12:47