గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలకు సోంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంను ముట్టడి చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రామావత్ లక్షణ్ నాయక్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతున్నామని పత్రిక ప్రకటన మాత్రమే ఇచ్చి విద్యార్థుల కడుపులు మాత్రం మాడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని విద్యార్ధి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా 5,177 కోట్లు రూపాయలు స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ ప్రభుత్వం విడుదల చేయకుండా, విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తుందని, బడ్జెట్లో 0.1 శాతం కూడా కాదు ఈ నిధులు విడుదల చేయడానికి అని అన్నారు. మూడేళ్ళ నుండి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్య మంత్రికి కానీ, ఒక్కమంత్రి, ఎమ్మెల్యే కి కానీ ఒక్కనెల కూడా వాళ్ళు జీతాలు పెండింగ్ లేవు మరి విద్యార్థులకు ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి యూనిఫామ్ ఇవ్వలేదు, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవు, లెక్చరర్స్, టీచర్స్ ఖాళీలు భర్తీ లేదు, పంద్రాగస్టు కూడా పాత బట్టలతోనే విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్ళాలా అని ప్రశ్నించారు.
- ప్రభుత్వం గోప్పగా చెప్పుకుంటున్న గురుకులాలు మరింత ఆధ్వానంగా ఉన్నాయి. 1008 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కనీసం సౌకర్యాలు లేవు, సన్నబియ్యం పెడుతున్నామని చెబుతున్నా, ఆచరణలో అమలు లేదని విమర్శించారు.
- మెనూ అమలు లేదు, మెస్ బిల్లులు రాక నాణ్యమైన భోజనం పెట్టక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్మోటిక్ ఛార్జీలు నెలకు హస్టల్స్ విద్యార్ధులకు 62/- బాలురు, 150/- బాలికలకు ఇస్తున్నా, గత 8 నెలలుగా పెండింగులో ఉన్నాయని, ఎలా విద్యార్ధులు చదువుకోవాలని ఎస్ఎఫ్ఐ అడుగుతుందన్నారు. - 2018లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. గోప్పగా అసెంబ్లీలో ప్రకటించిన పథకం అమలు జరగడం లేదు. తక్షణమే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని అన్నారు.
- తక్షణమే విద్యా రంగం సమస్యలు పరిష్కారం చేయకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లను మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, శ్రీకాంత్, రాజేష్, మల్లేశ్వరి మౌనిక, రోజా, శ్రీవాణి, మంజుల రాహుల్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు.
Aug 07 2023, 19:27