NLG: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం లు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్ హెచ్ ఎం లలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లుగా గత 15 సంవత్సరాలుగా, పిఎస్సీలలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏఎన్ఎం లు మాట్లాడుతూ.. వీఆర్ఏ పంచాయతీ కార్యదర్శిలతో పాటు, ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ పరం చేయడం జరిగింది. కానీ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న మమ్మల్ని మాత్రమే ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మంది ఏఎన్ఎంలు చనిపోయిన కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, వారి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో, ఈ నెల 4వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కార్యక్రమంలో సుమారు 3500 మంది సెకండ్ ఏఏఎంలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు.
కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి, ఏఎన్ఎంలు స్వప్న, సుచిత్ర, సరిత, పద్మ , రోజా, మమత, మంజుల, సుమలత, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Aug 07 2023, 17:18