NLG: బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ 89వ జయంతి
నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి అని గౌరీశంకర్ అన్నారు. బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 89 వ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి.. తెలుగు అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్, టీఎన్జీవో నాయకులు శ్రవణ్ కుమార్, శ్రీనివాసాచారి, కిరణ్ కుమార్, ప్రదీప్ , కవులు రచయితలు మునాస వెంకన్న, కృష్ణకౌడిన్య, బుచ్చిరెడ్డి, వివిధ హోదాల ప్రజా ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయన ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు.
తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ అంచలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయ్యారన్నారు. అందరి హృదయాలలో నిలిన మహోన్నత వ్యక్తి ప్రో. జయశంకర్ సార్ అని అన్నారు.
Aug 07 2023, 10:47