విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నల్లగొండలో రెండు రోజుల దీక్ష ప్రారంభం
నల్లగొండ: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, శనివారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్.. ప్రారంభించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి., డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే SC / ST / BC / EBC విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ రేటు రూ. 1800/- నుండి 15,000/- రూపాయలకు పెంచాలి.
SC / ST / BC కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/ - రూపాయలకు, పాఠశాల SC / ST / BC హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/ - నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ముఖ్యమంత్రి బి.సి.లకు 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతున్నామని, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని జనార్దన్ గౌడ్ అన్నారు.
అదేవిధంగా SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టెఫాండు" మంజూరు చేయాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి.
బి.సి. స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి శివకుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయితరాజు సిద్దు ,కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపెళ్లి గౌతమ్, మనీ, పృద్వి, మౌనిక, మనీషా, లక్ష్మి , శ్రీదేవి, సౌందర్య, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, రమేష్ ఆక మహేష్, అబ్బనబోయిన స్వామి, కిరణ్, అంజి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Aug 06 2023, 13:08