క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం..
ఆగస్ట్ 9,10 మహా పడావ్ విజయవంతం చేయండి.
కేంద్ర కార్మిక విధానాలను ప్రతికటించి క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిత భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకుందామని ఆగస్టు 9,10 తేదీలలో కలెక్టరేట్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు
శనివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ సమావేశం సుందరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచావుకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. డిజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది. పార్లమెంటులో తనకున్న మంద బలంతో మూడు రైతన్న వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ 2015లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ద్వారా హామీ నేటికీ అమలు కాలేదు. రైతన్న అనుకూల ప్రభుత్వమని గొప్పలు చెప్పే బిజెపి ప్రభుత్వానికి రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయింది.2023- 24 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించింది. ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలతో ఉక్కుపాదం మోపిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులను సైతం పాతరేస్తున్నది.ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి,అసమానతలు, ఆరోగ్య సంరక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకో పోగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను క్రూరంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు అందించే విధంగా తన పెట్టుబడిదారి వర్గ స్వభావాన్ని చాటుకుంటున్నదని, అనేక మంది త్యాగాలు రక్త తర్ప నం తో సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగ మారుస్తూ పార్లమెంట్ లో చట్టం చేసిందని అన్నారు. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రత కోడ్ ,వృత్తి సంబంధిత రక్షణ ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ లతో, పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమలుకి తెస్తున్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి దోపిడికి అద్దు లేకుండా పోతున్నది.సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఈ లేబర్ కోడ్ లతో అనాధలుగా మారనున్నారు. ప్రభుత్వ స్కీం లోని కోటి మంది స్కీం వర్కర్లు ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకునే స్థితి లేదు. ఇండియన్ లేబర్ కాంగ్రెస్ కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ఐఎల్ఓ తీర్మానాలు గంగలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కొత్త లేబర్ కోడులతో కార్మిక వర్గం తిరిగి బానిసత్వంలోకి మెట్టబడుతున్నది. కార్పొరేట్ యజమాన్యాల లాభాలు కోరల్లో కార్మికుల జీవితాలను బలి చేస్తున్నదని అన్నారు.స్వాతంత్ర అనంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వ రంగ మౌలిక వసతులు సహజ వనరులను కార్పోరేట్లు లూటీ చేసే విధాన నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. వ్యూహత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలు తెగ నమ్ముతున్నది.
నేషనల్ మానిటైజేషన్ పైపులను పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజులు పేరుతో దార దత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైలు, విద్యుత్ స్టేషన్లో, ట్రాన్స్మిషన్, సహజవాయువులు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్సిఐ గోదాన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులు అన్నిటిని కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో ప్రజలు ఈ సౌకర్యాల కోసం వేలాది రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణి 4 బొగ్గు గనులను వేలం వేసినది. హైదరాబాదులో కేంద్రకృతమైన బీడీఎల్, బిహెచ్ఈఎల్, మితాన్ లాంటి సంస్థలతో 25 నుండి 50% దాకా వాటాలను అమ్మేసింది. కార్మికులు మధ్యతరగతి లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్ఐసిలో లక్ష కోట్ల రూపాయలు వాటలు అమ్మేందుకు తెగ బడింది. కార్పొరేట్లే కొట్టిన రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు స్కూల్ స్వీపర్లు సమ్మెలు చేస్తున్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు వారి పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేసింది జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక సంఘాల ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో ఆగస్టు 9 జిల్లా కలెక్టరేట్ ముందు ఆర్డీవో కార్యాలయం ముందు జరుగు మహాధర్నాలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సలివొజు సైదాచారి, సాగర్ల యాదయ్య, గంజి నాగరాజు , నకరికంటి సుందరయ్య ఆవురేష్ మారయ్య, కత్తుల జగన్ సాగర్ల మల్లయ్య పల్లె నగేష్ కార్డింగ్ రవి బైరు నరసింహ భీమనపల్లి శంకర్ కొండేటి అంజయ్య ఐతరాజు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు
Aug 05 2023, 23:10