వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
..........
.. వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
.. ప్రతీ ఇంటికెళ్లి బాధితులతో మాట్లాడిన సతీష్ రెడ్డి
.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
.. మరింత మంది దాతలు ముందుకు రావాలని వినతి
....
వరద బాధితుల ఇళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. ఇటీవల కురిసన అతిభారీ వర్షాలకు అతలాకుతలమైన ములుగుజిల్లాలోని గ్రామాల్లో ఆయన రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షాపాతం నమోదైన వెంకటాపూర్ మండలం బూర్గుపేట గ్రామానికి వెళ్లిన ఆయన.. గ్రామం మొత్తం కలియతిరిగారు. ప్రతీ ఇంటిని పరిశీలించారు. చాలా ఇళ్ల గోడలు కూలిపోయి, పైకప్పు మాత్రమే మిలిగి ఉండటం చూసి ఆవేధన చెందారు. ఒక్కో ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని.. కట్టుబట్టలే మిగిలాయని చాలా మంది స్థానిక మహిళలు తమ కూలిన ఇళ్లను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వంట చేసుకోవడానికి వంట పాత్రలు కూడా లేకుండాపోయాయన్నారు. దీనిపై స్పందించిన సతీష్ రెడ్డి గారు.. ఇళ్లు కూలిపోయిన వారందరికి కొత్త ఇల్లు కట్టి ఇస్తామని భరోసా ఇచ్చారు. బూర్గుపేట వాసుల బాధలను జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, అలాగే గౌరవ సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మరో మార్గంలేక వరదధాటికి శిథిలమైన ఇళ్లలోనే ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదకు మట్టిగోడలు నానిపోయి కూలే ప్రమాదం ఉందని.. వీలైతే కొద్ది రోజుల పాటు బంధువుల ఇళ్లలో గానీ, ప్రభుత్వ పునరావాస కేంద్రంలోగానీ ఉండాలని సలహా ఇచ్చారు. సంవత్సరమంతా పడాల్సిన వర్షం ఒకట్రెండు రోజుల్లో పడటంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు.
బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి భరోసానిచ్చారు. తర్వాత వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, చిన్నారులకు పోషకాహర విలువలున్న పదార్థాలను పంపిణీ చేశారు.
తర్వాత వెంగలాపూర్, కాల్వపల్లి, ఎలుబాక, మేడారం గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు పంపించిన సరుకులను ఆయన తరపున నిజాంపేట్ 9వ డివిజన్ కార్పోరేటర్ రజిత రవికాంత్ గారు అందించారు. నాలుగు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 100 మందికి సరుకులు, దుస్తులు అందజేశారు. వారితో కలిసి సతీష్ రెడ్డి గారు బాధితులకు సరుకులు అందించారు.
వరద బాధిత గ్రామాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే సాయానికి.. సంస్థల సహకారం కూడా తోడైతే.. వీలైనంత త్వరగా గ్రామాల పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవిందనాయక్, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎస్ఐ తాజోద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి 
వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేయకుండా విడుదల చేసిన జిఓ 98 ని సవరించి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య కోరారు.
నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్గొండ పట్టణంలో కేసీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం..
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన భారత రాష్ట్ర సమితి సంబరాలు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..
Aug 05 2023, 14:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.5k