ఎక్సైజ్ నోటిఫికేషన్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి
వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేయకుండా విడుదల చేసిన జిఓ 98 ని సవరించి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం 2023 2025 సంవత్సరాలకు మద్యం షాపులు నిర్వాహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మద్యం షాపులో రిజర్వేషన్‌లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 5, 2021న జిఓ 98 విడుదల చేసిందని ఈ జిఓ ప్రకారం గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్‌సి 10 శాతం ,ఎస్‌టి 5 శాతం షాపులు కేటాయించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ జీఓలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొనలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని విడుదల చేసిన జీఓ 1 కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ పాలసీ ఉందన్నారు. ఈ పాలసీ వికలాంగుల తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. .
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని చట్టం పేర్కొందని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టానికి భిన్నంగా జీఓ 98 విడుదల చేసిందన్నారు. 2023-2025 సంవత్సరాలకు 2,620 వైన్ షాపుల కేటాయింపు కోసం టెండర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తక్షణమే జీఓ 98ను సవరించి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తూ ఎక్సైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన ఎక్సైజ్ నోటిఫికేషన్ రద్దు చేయకుంటే వికలాంగుల సంఘాలతో కలిసి టెండర్స్ అడ్డుకుంటామని హెచ్చరించారు.

వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేయకుండా విడుదల చేసిన జిఓ 98 ని సవరించి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య కోరారు.

నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్గొండ పట్టణంలో కేసీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం..
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన భారత రాష్ట్ర సమితి సంబరాలు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు….
Aug 04 2023, 20:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.7k