మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన...రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రుణపడి ఉంటాము
- మొహమ్మద్ మున్నా
టిఆర్విఎస్ - అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు సొంత జాగ ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు జూలై 21st న చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి, జి.ఓ ఇప్పించినందుకు వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము.
రాష్ట్రములోని వికలాంగులు సంతోషంతో ఉన్నారని సొంతింటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నారు. ఈ జీవోతో వికలాంగులలో అత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ జి.ఓ 25 కు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జివో నెంబర్ 33ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5% కేటాయిస్తారు. ఇది తెలగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో వికలాంగులకు లభించిన మరొక గొప్ప భరోసా.
మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన.రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా, దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న, గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన భారత రాష్ట్ర సమితి సంబరాలు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు….

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ 3 నెలలు.. రూ.50,910 కోట్లు

Aug 03 2023, 17:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.8k