NLG: శాసనసభ సమావేశంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి: జనార్దన్ గౌడ్
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న బిసి ఏ సంక్షేమ హాస్టల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మొదటగా విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి, బిసి సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంతభవనాలు ఎర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని, ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన చేసుకోవాలని అన్నారు.
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వాన్ని, పోరాట పట్టిమ పెంచుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించకపోవడం చాలా దుదుష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిరంతరం విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారని, సంక్షేమ వసతి గృహాలైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందంటే ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితమే అని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంక్షేమ కమిటీలు వేస్తామని అన్నారు. ఈరోజు బీసీ ఏ హాస్టల్లో కమిటీని వేయడం జరిగింది. హాస్టల్ అధ్యక్షుడిగా ఏ. వేణు, ఉపాధ్యక్షుడిగా కే. నాగరాజు, జనరల్ సెక్రెటరీగా కే .హరీష్ , సెక్రటరీగా బి .ఉదయ శంకర్ ,కార్యదర్శిగా వి .అఖిల్ లను నియమించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, మహేష్, కుమార్, సురేష్ , పృధ్విరాజ్, శంకర్ మణికంఠ, రమేష్, రాఘవేంద్ర, హరి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Aug 03 2023, 14:02