/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz యాదాద్రి జిల్లా: బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి Mane Praveen
యాదాద్రి జిల్లా: బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పమేలా సత్పతి 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. వారు జీ.ఏ.డీ లో రిపోర్ట్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణారెడ్డి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ని యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా టి. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ .1,50,000/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా చండూర్ మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బి. రాధికకు రూ. 60,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే కూసుకుంట్ల అందజేశారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 1,00,000/-  సహాయానిధి చెక్కును ఎమ్మెల్యే  అందజేశారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ TET నోటిఫికేషన్‌ను విడుదల
TS: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులు బిఈడి లేదా డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ TET నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15 న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు రూ.400 గా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో https://tstet.cgg.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.
బాధిత కుటుంబానికి ఆరు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా, మునుగోడు: ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొంపెల్లి ఎంపిటిసి మోగుదాల సాలయ్య కుటుంబానికి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబానికి అందజేసి, వారికి భరోసా కల్పించి అండగా నిలిచారు. గతంలో ఆ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందజేశారు.  ఆ కుటుంబ పరిస్థితిని చూసి 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబ సభ్యులకు అందజేసి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా యాదవ ఐక్యవేదిక సంఘం కార్యదర్శిగా పాక నగేష్ యాదవ్ నియామకం
నల్లగొండ: యాదవ సంఘం భవన్లో జిల్లా యాదవ విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు ఈరటి బాలరాజు యాదవ్ అధ్యక్షతన, సోమవారం యాదవ విద్యావంతుల ఐక్య వేదిక సంఘం కార్యక్రమంలో, రాష్ట్ర యాదవ సంఘం విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ మరియు రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్యవేదిక కార్యదర్శి దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్ ల నుండి.. జిల్లా యాదవ ఐక్యవేదిక సంఘం కార్యదర్శిగా మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యాదవ సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు యాదవ సోదరులు పాల్గొన్నారు.
వికలాంగుల సర్టిఫికెట్ పొందాలంటే.. మీసేవ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి
నల్లగొండ జిల్లా: సదరం ధ్రువీకరణ పత్రం పొందగోరు శారీరక, మానసిక వికలాంగులు, కంటి రుగ్మత, వినికిడి లోపం ఉన్న వారి  కోసం ఆగస్టు నెల కు సంబంధించిన షెడ్యూలు విడుదలైంది. ఇందుకోసం దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు క్యాంపు షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 3, 8, 22, 29, 31 తేదీలలో శారీరక వైకల్యం ఉన్నవారికి క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్లాట్ లో పొందుపరిచిన తేదీ, సమయానికి.. నల్లగొండలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని సదరం కార్యాలయంలో హాజరు కావాలని  చెప్పారు.
మరెందుకు ఆలస్యం వెంటనే దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి సదరం స్లాట్ బుక్ చేసుకోండి. SHARE IT
దళిత బంధులో మాలలకు 50% కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, సోమవారం జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు చలిచీమల యాదగిరి మర్యాపూర్వకంగా కలిసి 2వ విడుత దళిత బందు పథకంలో నియోజకవర్గంలోని మాలలకు 50% కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శిర్గమళ్ళ కిశోర్, అద్దంకి రామలింగయ్య, బేరి రవీందర్, బెల్లం బాలశివరాజు, బాజా మనోజ్, సంకు యాదగిరి, ఈద పవన్, ముచ్చపోతుల నర్సింహా, వడ్డేపల్లి శంకర్, బండారు లింగస్వామి, చలిచీమల శంకరయ్య, నరసింహ, కట్ట పవన్ కళ్యాణ్, సంకు నరసింహ, పిట్టల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు
బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
NLG: ఆగస్టు 10న జరగబోయే బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను, దేవరకొండలో ఆదివారం డా. ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, కన్వీనర్ అనుముల సురేష్, కో కన్వీనర్ ఆకులపల్లి నరేష్ ఉన్నారు

NLG: ఆగస్టు 10న జరగబోయే బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను, దేవరకొండలో ఆదివారం డా. ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, కన్వీనర్ అనుముల సురేష్

గురుకుల అభ్యర్థులకు ఒకే పరీక్ష సెంటర్ ఉండాలి: పిడిఎస్యు
నల్లగొండ: గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను అభ్యర్థుల సొంత జిల్లాలోని నిర్వహించాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ పిడిఎస్యు కార్యాలయంలో జరిగిన పిడిఎస్యు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్   మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహించే గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలను ఒక పరీక్ష ఒక్కో జిల్లాలో నిర్వహించడం వల్ల, గురుకుల టీచర్ అభ్యర్థులు సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు వరుసగా ఏర్పాటు చేయడంతో, చిన్నపిల్లలతో, గర్భిణీ మహిళ అభ్యర్థులు ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒకే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సరి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు  జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు మధు, చందన, మనిషా, వీరేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
'కులమాతలకు అతీతంగా మొహరం': మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నకిరేకల్: కుల మతాలకు అతీతంగా ప్రజలు సామరస్యంగా జరుపుకునేది ‘మొహర్రం’ అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. నకిరేకల్ మునిసిపాలిటీలోని 7వ వార్డు బాబన్ సాహెబ్ గూడెంలో నిర్వహిస్తున్న ‘మొహర్రం’ కార్యక్రమానికి శనివారం ఆమె హాజరై, పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా, సంతోషంగా జరుపుకునేదే మొహరం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, జస్వ, విజయ్, ముస్లిం మత పెద్దలు ఎస్కే సలీం, యాకుబ్ అలీ, జానీమియా, ముస్లిం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.