/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz దళిత బంధులో మాలలకు 50% కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం Mane Praveen
దళిత బంధులో మాలలకు 50% కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, సోమవారం జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు చలిచీమల యాదగిరి మర్యాపూర్వకంగా కలిసి 2వ విడుత దళిత బందు పథకంలో నియోజకవర్గంలోని మాలలకు 50% కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శిర్గమళ్ళ కిశోర్, అద్దంకి రామలింగయ్య, బేరి రవీందర్, బెల్లం బాలశివరాజు, బాజా మనోజ్, సంకు యాదగిరి, ఈద పవన్, ముచ్చపోతుల నర్సింహా, వడ్డేపల్లి శంకర్, బండారు లింగస్వామి, చలిచీమల శంకరయ్య, నరసింహ, కట్ట పవన్ కళ్యాణ్, సంకు నరసింహ, పిట్టల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు
బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
NLG: ఆగస్టు 10న జరగబోయే బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను, దేవరకొండలో ఆదివారం డా. ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, కన్వీనర్ అనుముల సురేష్, కో కన్వీనర్ ఆకులపల్లి నరేష్ ఉన్నారు

NLG: ఆగస్టు 10న జరగబోయే బహుజన విద్యార్థి గర్జన వాల్ పోస్టర్ ను, దేవరకొండలో ఆదివారం డా. ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, కన్వీనర్ అనుముల సురేష్

గురుకుల అభ్యర్థులకు ఒకే పరీక్ష సెంటర్ ఉండాలి: పిడిఎస్యు
నల్లగొండ: గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను అభ్యర్థుల సొంత జిల్లాలోని నిర్వహించాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ పిడిఎస్యు కార్యాలయంలో జరిగిన పిడిఎస్యు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్   మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహించే గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలను ఒక పరీక్ష ఒక్కో జిల్లాలో నిర్వహించడం వల్ల, గురుకుల టీచర్ అభ్యర్థులు సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు వరుసగా ఏర్పాటు చేయడంతో, చిన్నపిల్లలతో, గర్భిణీ మహిళ అభ్యర్థులు ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒకే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సరి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు  జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు మధు, చందన, మనిషా, వీరేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
'కులమాతలకు అతీతంగా మొహరం': మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నకిరేకల్: కుల మతాలకు అతీతంగా ప్రజలు సామరస్యంగా జరుపుకునేది ‘మొహర్రం’ అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. నకిరేకల్ మునిసిపాలిటీలోని 7వ వార్డు బాబన్ సాహెబ్ గూడెంలో నిర్వహిస్తున్న ‘మొహర్రం’ కార్యక్రమానికి శనివారం ఆమె హాజరై, పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా, సంతోషంగా జరుపుకునేదే మొహరం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, జస్వ, విజయ్, ముస్లిం మత పెద్దలు ఎస్కే సలీం, యాకుబ్ అలీ, జానీమియా, ముస్లిం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మారెడ్డిపల్లి కాలువలపై కల్వర్టు దారులు నిర్మించాలి: నూనె వెంకట్ స్వామి
యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం గ్రామంలోని ధర్మారెడ్డిపల్లి కాలువలపై రైతాంగం రాకపోకలకు వీలుగా రెండు కల్వర్టు దారులను నిర్మించాలని,  వ్యవసాయాలు నిర్వహించుకోవడానికి వీలుగా కాలువలపై దారులు నిర్మించాలని ప్రజా పోరాట సమితి పి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. శనివారం మండలంలో గల సర్నేనిగూడెంలోని ధర్మారెడ్డిపల్లి కాలువపై రైతుల వ్యవసాయ కమతాలకు వెల్లే దారులు లేని వైనాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడుతూ.. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని లేదంటే.. కలెక్టరేట్, నీటిపారుదల శాఖ కార్యాలయాల ముందు పెద్దఎత్తున రైతాంగంతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు వరికల్ గోపాల్, బొడ్డుపల్లి కాడయ్య, చిట్టిమళ్ళ శ్రవణకుమార యోధ, కట్ట మహేందర్, ఉయ్యాల లింగస్వామి గౌడ్, నీల స్వామి ముదిరాజ్, కావలి ఈదయ్య ముదిరాజ్, కావలి గోపాల్ ముదిరాజ్, గంగాదేవి నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి: బుడిగ వెంకటేష్
నల్లగొండ జిల్లా, దేవరకొండ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కెజీబివిలో, మోడల్ స్కూల్స్ లోకి.. డిఇఓ అనుమతి లేకుండా,  లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ అన్నారు. దేవరకొండలో  శుక్రవారం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో‌, కెజిబివిల లో పాఠ్యపుస్తకాలు రాలేదు, మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు, ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని, పోరాడే విద్యార్థి సంఘాలను ప్రజాసంఘాలను రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు. తక్షణమే విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్, ఆంజనేయులు, అశోక్, చందు, తదితరులు ఉన్నారు
NLG: పలు గురుకుల విద్యాసంస్థలను సందర్శించిన పిపిఎల్ కమిటీ నాయకులు
నల్లగొండ: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పిపిఎల్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, గత వారం నుండి కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో.. ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం కోసం, శుక్రవారం పిపిఎల్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ నాయకులు జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలను కళాశాలను సందర్శించి ఆర్ సి ఓ అరుణకుమారి, వివిధ కళాశాలల పాఠశాలల ప్రిన్సిపాల్ లను, విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పిపిఎల్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. వసతులన్నీ బాగానే ఉన్నాయని, అయితే అద్దె భవనాలలో ఉన్న పాఠశాలలకు కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పిపిఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి శ్రీనివాస్, నాయకులు బొజ్జ పాండు, నాగుల శ్రీనివాస్, నరసింహ, రాజు, గురుకుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
ట్విట్టర్ ఇకనుండి 'X' గా కనపడనుంది
ట్విట్టర్ పిట్ట కనుమరుగయ్యింది. ట్విట్టర్ తన రూపాన్ని మార్చుకుంది.
బ్ల్యూ కలర్ లో కనిపించాల్సిన పిట్ట బొమ్మతో పాటు, ట్విట్టర్ అనే పేరును ఆ సంస్థ తొలగించింది. ఆ పిట్ట బొమ్మ స్థానంలో  'X'  అనే అక్షరం రూపంతో ఉన్న బొమ్మతో పాటు ట్విట్టర్ పేరును కాస్త 'X' గా మార్చారు. కొత్త లోగో, నలుపు నేపథ్యంలో తెలుపు శైలీకృత "X" గా కనపడనుంది.
ఇప్పటి నుండి ట్విట్టర్ X గా కనపడనుంది.
YBD: అభివృద్ధికి నోచుకోని రామన్నపేట ఎస్సి కాలనీ
యాదాద్రి జిల్లా, రామన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న ఎస్సి కాలనీ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వుంది అని బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా అన్నారు. రామన్నపేట మేజర్ గ్రామ పంచాయితీ లో సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆశించిన మేరకు పట్టణ పారిశుద్ద్యం విషయంలో వెనుకబడి పోగా,  దానికి తగిన పురోగతి కనిపించకపోవడంతో ఎస్సి కాలనీ ప్రజలు ఆవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎందరు అధికారులు మారినా రామన్నపేట పట్టణ ఎస్సి కాలనీ ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. ఆరంభంలో ఉన్న ఆర్భాటం ఆచరణలో తప్పటడుగులేస్తుందని, నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్సీ కాలనీ ని పట్టించుకోకపోవడం విడ్డూరం అని అన్నారు. ఎస్సి కాలనీ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆరోపించారు. వర్షాకాలంలో సరైన డ్రైనేజీ లేక నీళ్లు నిలవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి జిల్లా: కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08685 293312, 9121147135  అని తెలిపారు. వర్షాల పట్ల ప్రజలందరూ  అప్రమత్తంగా ఉండాలని, అనుకోని సంఘటన జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు.