/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..
తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం
భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు
ధవళేశ్వరం వద్ద వరద ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి..
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు..
వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది.
అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు..
నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!
పార్లమెంట్ లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేంద్రం కీలక బిల్లులను సోమవారం సభ ముందుకు తీసుకొస్తోంది. అందులో ఉద్యోగులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టనుంది..
కీలక బిల్లు ప్రతిపాదన:మణిపూర్ అంశం పైన నిరసనలతో హోరెత్తుతున్న పార్లమెంట్ లో ఈ రోజు మరింత ఆసక్తి కర అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపక్షాలుప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే తేదీని స్పీకర్ ఓం బిర్లానిర్ణయించనున్నారు.
ఈ తీర్మానం కూడా ఈవారంలోనే చర్చకు రావచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో ఢిల్లీ బిల్లు ఆమోదం పొందడం సులభమే. రాజ్యసభలో మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. రాజ్యసభ పూర్తి సంఖ్యాబలం 243 కాగా కొన్ని ఖాళీలు ఉండడంతో 238 మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు..
వైసీపీ మద్దతు కీలకం:రాజ్యసభలో బీజేపీకి 92 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏ కూటమి పక్షాన 105 మంది ఉన్నారు. అయిదుగురు నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ చెబుతోంది. బీఆర్‌ఎస్ ఈ బిల్లును వ్యతిరేకించినా ప్రతిపక్షాల సంఖ్యాబలం 108కు మించదని, అందువల్ల ఆమోదంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాజ్యసభ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా లెక్కల మేరకు 112 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలుతున్నా బిల్లు ఆమోదం పొందడానికి సరిపోదు. అందువల్ల వైసీపీకి చెందిన 9 మంది సభ్యులు, బీజేడీకి చెందిన 9 మంది సభ్యులపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల్లో వైసీపీ ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది, బీజేడీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. బిజేడీ పరోక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
సమావేశాల పై ఉత్కంఠ:వైసీపీ, బీజేడీ మద్దతుతో ఢిల్లీ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్న విశ్వాసంతో మోదీ ప్రభుత్వం ఉన్నది. ఈ బిల్లు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 90 ఏళ్ల వయస్సున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వీల్ చైర్ లో సభకు రానున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలోనే అవిశ్వాసం పైన చర్చకు స్పీకర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ బిల్లును అడ్డుకోవాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. అవిశ్వాసం పైన ఈ నెల 2న లోక్ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఒక్కో సభ్యుడు ఉన్న టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ మద్దతు కూడా తమకే దక్కుతుందని బీజేపీ అంచనా వేస్తోంది..
ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు?
వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల,
రాజన్న సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ, ఆగస్టు 2న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.
గడిచిన 24 గంటల్లో స్వల్ప వర్షపాతం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో 22.7 మి. మీ, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 21.4 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 17.1 మి.మీ,
ఖమ్మం జిల్లా వేం సూరులో 14.3 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 13.4 మి.మీ, వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 12.6 మి.మీ, జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో 11.4 మి.మీ, వరంగల్ జిల్లాలోని నెక్కొండలో 11.2 మి.మీ, రాయపర్తిలో 9.6 మి.మీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది...
Nellore: నర్సాపురం-ధర్మవరం రైలుకు తప్పిన పెను ప్రమాదం..
కావలి: నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది.
ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఈ ప్రమాదం నుంచి బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. కావలి-బిట్రగుంట మధ్య ఎగువమార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు.
ఈ క్రమంలో నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ అదేమార్గంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ పట్టా ముక్కను రైలు ఢీకొట్టగానే అది దూరంగా పడిపోయింది.
దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం..
Fire Accident : ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు
అహ్మదాబాద్ : గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్(Ahmedabad)లోని ఓ ఆస్పత్రిలో భారీగా మంటలు(Fire Accident) చెలరేగాయి. దీంతో వంద మందికిపైగా పేషంట్లను అక్కడి నుంచి తరలించారు..
ఘటనాస్థలికి చేరుకున్న 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అహ్మదాబాద్‌లోని షాయిబాగ్ ప్రాంతంలో ఉన్న 'రాజస్థాన్ ఆస్పత్రి' బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటలకు మంటలు వచ్చాయి.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు త్రీవంగా శ్రమిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా పై అంతస్తుల్లో ఉన్న పేషంట్లను ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఆస్పత్రిని ఓ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తోంది..
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం
ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది.
కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ మార్గ్ లో హుస్సేన్ సాగర్ కు రక్షణ గోడ నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు...
భద్రాచలంలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది.
ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
నదిలో పెద్దఎత్తున నీరు వరస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి ఉధృతికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపైకి నీరు చేరింది.
దీంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి....
టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభం
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు.
నిర్మాతలే దాదాపు 1600 మంది ఉన్నారు. ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది.
సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి.
ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు....
Jul 31 2023, 15:50