కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల చేస్తున్న పోరాటంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం సిఐటియు నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని విమర్శించారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం 26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మిక హక్కుల పై దాడి అధిక ధరలు నిరుద్యోగం ప్రజలందరి సమస్యల పైన 11 కేంద్ర కార్మిక సంఘాలు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో జిల్లా కలెక్టరేట్ల ముందు ఆగస్టు 10న ఆర్డీవో కేంద్రాలలో జరిగే ధర్నా ల లో కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు.
కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో , కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. సమ్మెల పట్ల మొండి వైఖరి విడనాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు,ఐకెపి వివో ఏ, ఆశ వర్కర్స్ ,మున్సిపల్, ఆర్టీసీ, సింగరేణి, అంగన్వాడి ,మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ స్వీపర్ల్, కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ రకాల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ చేసి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని తెలియ చేశారు . ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు
సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి ,జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదయ్య, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నారబోయిన శ్రీనివాస్, మల్లు గౌతమ్ రెడ్డి, కానుగు లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పెంజెర్ల సైదులు, కరిమ్మున్నిసా బేగం, అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ, దయానంద్, భీమ గాని గణేష్, సలివొజు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, సాగర్ల యాదయ్య, సుందరయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Jul 30 2023, 18:42