Fire Accident : ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు
అహ్మదాబాద్ : గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్(Ahmedabad)లోని ఓ ఆస్పత్రిలో భారీగా మంటలు(Fire Accident) చెలరేగాయి. దీంతో వంద మందికిపైగా పేషంట్లను అక్కడి నుంచి తరలించారు..
ఘటనాస్థలికి చేరుకున్న 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అహ్మదాబాద్‌లోని షాయిబాగ్ ప్రాంతంలో ఉన్న 'రాజస్థాన్ ఆస్పత్రి' బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటలకు మంటలు వచ్చాయి.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు త్రీవంగా శ్రమిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా పై అంతస్తుల్లో ఉన్న పేషంట్లను ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఆస్పత్రిని ఓ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తోంది..











Jul 30 2023, 10:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.8k